16న నరసం రాష్ట్ర సదస్సు
కర్నూలు కల్చరల్: నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం (నరసం) సాహితీ సదస్సు సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీ సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో నరసం 7వ వార్షికోత్సవ రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నట్లు నరసం జిల్లా అధ్యక్షురాలు సుబ్బలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రచయిత్రులు అందరూ ఒక వేదికపైకి రావాలి, రచనా సామర్థ్యాన్ని మెరుగు పరుచుకోవాలి, సమకాలీన సమస్యలపై స్పందించి రచనలు చేసి మంచి సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో నరసం ముందుకు సాగుతుందన్నారు. విద్యార్థుల్లో రచనా శక్తిని, సృజనాత్మకతను పెంచేలా నరసం పనిచేస్తుందన్నారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు ప్రారంభ సభ ఉంటుందన్నారు. ఐదు సెషన్‌లు కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. కవిసమ్మేళనాలు, పుస్తకావిష్కరణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. సుమారు 40 మంది ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన కయిత్రులు, రచయిత్రులు కవిసమ్మేళనాల్లో పాల్గొంటారన్నారు. సమావేశంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, తెలుగు భాషా వికాస ఉద్యమం కార్యదర్శి జేఎస్‌ఆర్కే శర్మ, నరసం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ దండెబోయిన పార్వతీ దేవి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment