
హామీల అమలులో చంద్రబాబు విఫలం
ఆలూరు: ఎన్నికల హామీలను అమలు చేయడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేంద్రరెడ్డి విమర్శించారు. ఆలూరులోని ఓ హోటల్‌లో ఆయన శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. అధికారం కోసం ఎన్నికల ముందు కూటమి నాయకులు అనేక హామీలు ఇచ్చారన్నారు. ప్రజలు నమ్మి ఓటేసి గెలిపించాక వాటిని అమలు చేయకపోగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదని సాకులు చెబుతున్నారన్నారు. తొలి నుంచి ప్రజలను మోసం చేయడం బాబు నైజమన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇస్తే తప్పరని, అందుకు ఆయన ఐదేళ్ల పాలనే నిదర్శనమన్నారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ఆయనదని చెప్పారు. సచివాలయ, ఆర్‌బీకేల ద్వారా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని వైఎస్ జగన్ తీసుకొచ్చారన్నారు. నేడు వాటిని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు.ప్రశ్నించే వారిపై దాడులు, కేసులతో బెదిరిస్తోందని చెప్పారు. అన్యాయంగా వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేస్తుందని..కూటమి అరాచక పాలనను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. సమావేశంలో దేవనకొండ మండలం సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు అరుణకుమార్, అలిగేరు గ్రామ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, ఎల్లార్తి అశోక్‌రెడ్డి కొత్తకాపు శేషాద్రిరెడ్డి, మోహిద్దీన్, రాఘవేంద్రరెడ్డి, రంగస్వామి, మల్లికార్జునరెడ్డి, తిక్కన్న, ప్రకాష్‌రెడ్డి ,రామాంజనేయులు, ప్రవీణ్, పులి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి
తెర్నేకల్ సురేంద్రరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment