
హోరాహోరీగా పోలీసు క్రీడాపోటీలు
పాణ్యం: నంద్యాల జిల్లా పోలీసు క్రీడా పోటీలు హోరాహోరీగా సాగాయి. నెరవాడ మెట్ట వద్ద ఉన్న ఆర్‌జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన క్రికెట్ ఫైనల్ పోటీల్లో శనివారం ఆత్మకూరు డివిజన్‌పై నంద్యాల ఏఆర్ డివిజన్ జట్టు విజయం సాధించింది. విజేత జట్టుకు ఏఆర్ ఆడిషినల్ ఎస్పీ చంద్రబాబు, ఏఆర్ డీఎస్పీ రాజసింహరెడ్డి, సీఐ చాంద్‌బాషా, మంజునాథ తదితరులు ప్రత్యేకంగా అభినందించారు.
బాలుడి మృతదేహం లభ్యం
పత్తికొండ రూరల్: మండల పరిధిలోని పందికోన గ్రామ సమీపంలో గల్లంతైన బాలుడు తులసీగౌడు(12) మృతదేహం శనివారం లభ్యమైంది. డోన్‌కు చెందిన దామోదర్‌గౌడు, రాజేశ్వరి దంపతుల కుమారుడైన తులసీగౌడ్ రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు హంద్రీవాగులో పడి గల్లంతైన సంగతి తెలిసిందే. బాలుడి ఆచూకీ కోసం ఏపీఎస్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన 15 మంది సిబ్బంది శుక్రవారం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో మృతదేహం కొట్టుకుని పోయి శనివారం మద్దికెర మండలం హంప గ్రామ సమీపంలోని వాగులో తేలింది. గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

హోరాహోరీగా పోలీసు క్రీడాపోటీలు
Comments
Please login to add a commentAdd a comment