
వేసవిలో తాగునీటి సమస్య తలెత్తనివ్వొద్దు
గోనెగండ్ల: వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ) డీఈ విజయ్‌కుమార్‌ను జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా ఆదేశించారు. శనివారం మండలంలోని జీడీపీని కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఎన్ని టీఎంసీల నీరు ఉంది.. ఎన్ని ఎకరాల ఆయకట్టు ఉంది, హెచ్‌ఎన్‌ఎస్ నుంచి ప్రాజెక్టుకు వచ్చే నీరు తదితర వివరాలను డీఈని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఏఈ మహమ్మద్ ఆలీ, తహసీల్దార్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
రేపు ఉద్యోగ మేళా
కోడుమూరు రూరల్: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 17వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనంజ్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఎస్‌సీ ఆపై విద్యార్హత కలిగిన యువతీయువకులు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హాజరయ్యే వారు వెంట విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment