
బాలల్లో నేర స్వభావాన్ని నియంత్రించాలి
● జిల్లా జడ్జి కబర్ధి
కర్నూలు: బాల నేరస్తుల్లో ఉండే నేర స్వభావాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి వారికి కౌన్సెలింగ్, విద్యాబోధన ద్వారా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి కబర్ధి అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కబర్ధి, కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి శనివారం జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్‌లో బాలుల న్యాయ చట్టం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కబర్ధి మాట్లాడుతూ అంతర్జాతీయ బాలల ఒడంబడిక ప్రకారం రాజ్యాంగంలో పొందుపరచిన ప్రత్యేక నిబంధనలపై పోలీసు అధికారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కర్నూలు డీసీపీఓ శారద, నంద్యాల డీసీపీఓ స్వప్న ప్రియదర్శిని, జేజేబీ మెంబర్లు మాధవి, సునిత, ఉమ్మడి జిల్లాల ప్రత్యేక జ్యువైనల్ పోలీసు యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment