ప్రశాంతంగా ఎన్‌సీసీ ‘సీ’ సర్టిఫికెట్ పరీక్ష
కర్నూలు కల్చరల్: ఎన్‌సీసీ ‘సీ’ సర్టిఫికెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కర్నూలు గ్రూప్‌లోని 9 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్, 28 ఆంధ్ర బెటాలియన్ కేడెట్స్‌కు ఆదివారం మెడికల్ కళాశాలలోని పరీక్ష కేంద్రంలో సీ సర్టిఫికెట్‌కు సంబంధించి థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. 322 మంది బాయ్స్ కేడెట్స్, 340 గర్ల్స్ కేడెట్స్ పరీక్షకు హాజరయ్యారు. కర్నూలు ఎన్‌సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ అలోక్ త్రిపాఠి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీ సర్టిఫికెట్ కలిగిన వారు మిగతా వారి కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతారన్నారు. అన్ని యూనిఫాం సర్వీసుల్లో చేరేందుకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. సాఫ్ట్‌వేర్, మెడిసిన్, ఐటీ, సివిల్ సర్వీసెస్‌లకు సంబంధించి కానీ ఏదైనా కంపెనీ ఇంటర్వ్యూలకు వెళ్లినప్పుడు ఎన్‌సీసీ హోల్డర్‌కు ప్రాధాన్యత ఇస్తారన్నారు. ఆయనతో పాటు 9 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్ జోబి ఫిలిప్, 28 ఆంధ్ర బెటాలియన్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ ప్రసాద్, సెంట్రల్ అబ్జర్వర్ కల్నల్ పార్మర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment