చికెన్ సెంటర్లు వెలవెల!
కర్నూలు(అగ్రికల్చర్): బర్డ్‌ప్లూ ఎఫెక్ట్‌తో చికెన్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. కర్నూలులో ఒక్క ఎన్‌ఆర్‌పేటలోనే కాదు.. నగరమంతా చికెన్ విక్రయాలు 10 శాతానికి పడిపోయాయి. కర్నూలు నగరంలో దాదాపు 200 వరకు చికెన్ సెంటర్లు ఉన్నాయి. సగటున ఒక్కో చికెన్ సెంటరు ద్వారా 200– 300 కిలోల వరకు అమ్మకాలు జరుగుతాయి. ఈ ప్రకారం నగరం మొత్తం మీద దాదాపు 6,000 కిలోల వరకు చికెన్ అమ్మకాలు ఉంటాయి. అయితే బర్డ్‌ప్లూ వెలుగు చూసిన తర్వాత ఆదివారం చికెన్ అమ్మకాలు 10 శాతానికి పడిపోయాయి. దీంతో పౌల్ట్రీ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. చికెన్/గుడ్లను 100 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉడికించి తినవచ్చని అధికారులు ప్రచారం చేస్తున్నప్పటికీ వినియోగదారుల్లో బర్డ్‌ప్లూ భయం పోవడం లేదు. కర్నూలులో చికెన్ కిలో ధర రూ.200/220 ఉండగా.. ఇతర ప్రాంతాల్లో రూ.150–180కి తగ్గించారు. అయినా వినియోగదారులు ఆసక్తి చూపడంలేదు. ఈక్రమంలో మాంసం, చేపలకు డిమాండ్ పెరిగింది. మటన్ కిలో ధర రూ.800/840 ఉండగా.. తాజాగా రూ.900/1000 పెంచేశారు. అయినా మటన్ అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయి. చేపల అమ్మకాలు నాలుగైదు రెట్లు పెరిగాయి.
6 కిలోలే విక్రయించాం
గత ఆదివారం 220 కిలోల చికెన్ విక్రయించాం. ఈ ఆదివారం చికెన్ అడిగే వారే లేరు. కేవలం మూడు కోళ్లు మాత్రమే కోసి ఆరు కిలోల చికెన్ విక్రయించాం. ఇంత దయనీయమైన అమ్మకాలు ఎపుడూ లేవు. కర్నూలులో బాతులకు మాత్రమే బర్డ్‌ప్లూ వచ్చింది. కోళ్లకు ఎలాంటి బర్డ్‌ప్లూ లేదు. కోళ్లలో మరణాలు కూడా లేవు. తగిన జాగ్రత్తలతో చికెన్ నిర్భయంగా తినొచ్చు. కానీ వినియోగదారులు మాత్రం భయపడుతున్నారు. – కిశోర్ యాదవ్, చికెన్ సెంటర్
నిర్వాహకుడు వెంకటరమణ కాలనీ, కర్నూలు
10 శాతానికి పడిపోయిన
చికెన్ విక్రయాలు
ధరలు తగ్గించినప్పటికీ చికెన్‌పై ఆసక్తి
చూపని వినియోగదారులు
మటన్, చేపలకు భారీగా పెరిగిన
డిమాండ్
అడ్డగోలుగా మటన్ ధరల పెంపు
చికెన్ సెంటర్లు వెలవెల!
Comments
Please login to add a commentAdd a comment