సమాజ హితానికి రచనలు దోహద పడాలి
కర్నూలు కల్చరల్: సమాజ హితానికి రచనలు దోహద పడాలని, యువ రచయిత్రులు, కవయిత్రులు సాహిత్య రచన చేసేందుకు ముందుకు రావాలని పలువురు సాహితీ వేత్తలు, వక్తలు అభిప్రాయపడ్డారు. ఆదివారం సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం (నరసం) వార్షికోత్సవంలో ప్రముఖ భాషా వేత్త డాక్టర్ జీవీ పూర్ణచంద్, సాహితీ వేత్త కురాడి చంద్రశేఖర కల్కూర, క్లస్టర్ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ ఆచార్య డీవీఆర్ సాయిగోపాల్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నరసం రాష్ట్ర అధ్యక్షరాలు లక్ష్మీకళావతి, కార్యదర్శి పాతూరి అన్నపూర్ణ, ఒరిస్సా బరంపురం సాహితీ వేత్త తుర్లపాటి రాజేశ్వరి మాట్లాడారు. రచయిత్రులు సమకాలీన అంశాలపై రచనలు చేసి సమాజానికి ఇతోధికంగా సేవలందించాలన్నారు. నరసం ఏర్పాటు అయ్యాక అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు భాషకు, సాహిత్యానికి విశేష కృషి చేయడం అభినందనీయమన్నారు. కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుదన్నారు. కుటుంబంలో ప్రతి ఒక్కరు ఒకరికొకరు గౌరవించుకుంటూ సీ్త్ర పురుషులు సమానంగా ఎదగాలన్నారు.టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి.పుల్లయ్య, తెలుగు భాషా వికాస ఉద్యమం కార్యదర్శి జేఎస్‌ఆర్కే శర్మ మాట్లాడారు. కవి సమ్మేళనాలు అలరించాయి. పలువురు రచయిత్రులు రచించిన పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలకు బహుతులను అందజేశారు. నరసం జిల్లా అధ్యక్షులు కా.వెం. సుబ్బలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ దండెబోయిన పార్వతీ దేవి, సభ్యులు పసుపులేటి నీలిమ, చంద్రమౌళిని, హైమావతి, కవులు, రయితలు హరికిషన్, అజీజ్, లక్ష్మయ్య, గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి, ఎలమర్తిరమణయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment