ఎస్టీ రిజర్వేషన్ కోసం పోరాడతాం
● ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్
కర్నూలు న్యూసిటీ: వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ కోసం పార్టీలకు అతీతంగా పోరాడతామని ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ తెలిపారు. బళ్లారి చౌరస్తాలోని ఓ హోటల్‌లో న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళం–ప్రజాపతినిధుల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని 70 ఏళ్లుగా పోరాడుతున్నామన్నారు. వాల్మీకుల బలగం వల్లే తమకు ఈ రాజకీయ పదవులు లభించాయన్నారు. కులానికి న్యాయం చేయాలనేదే తమ జీవిత ఆశయమన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో శాసన మండలిలో వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్లపై చర్చించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఆదోని ఎమ్మెల్యే పార్ధసారధి మాట్లాడుతూ ప్రస్తుతం వాల్మీకులు నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉండడం గర్వకారణమన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది రాజకీయంగా ఎదిగేలా కృషి చేయాలన్నారు.
13 టిప్పర్లు స్వాధీనం
బనగానపల్లె రూరల్: బనగానపల్లె ప్రాంతం నుంచి పలు చోట్లకు అధిక మోతాదులో సుద్ద పౌడర్‌ను రవాణా చేస్తున్న 13 టిప్పర్లను స్వాధీనం చేసుకునట్లు ఎస్‌ఐ దుగ్గిరెడ్డి ఆదివారం తెలిపారు. బేతంచర్ల రోడ్డు, యాగంటిపల్లె రోడ్లపై వాహనాలను తనిఖీ చేస్తుండగా సుద్ద పౌడర్ టిప్పర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని, వీటిని మైనింగ్ అఽధికారులకు అప్పగించనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఎస్టీ రిజర్వేషన్ కోసం పోరాడతాం
Comments
Please login to add a commentAdd a comment