కేఆర్‌ఎంబీ ఏర్పాటుపై సీఎం నిర్లక్ష్యం
కర్నూలు న్యూసిటీ: కర్నూలులో కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. కర్నూలు నగరం బళ్లారి చౌరస్తాలోని ఒక హోటల్‌లో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలో ఉపాధిలేక పేద ప్రజలు వలస పోతుంటే సీఎం చంద్రబాబు అమరావతిలో 47 అంతస్తుల ఐకానిక్ భవనా లు నిర్మించి ఎన్‌ఆర్‌ఐలకు అమ్ముతామని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. 2018లో గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణానికి పాలన అనుమతులు ఇచ్చిన బాబు ఇప్పుడు దానే ఊసే ఎత్తక పోవ డం దారుణమన్నారు. అనంతరం రాయలసీమ సాధ న సమితి నాయకులు బొజ్జా దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు నియంత పాలన సాగిస్తూ రైతుల హక్కులను కాలరాస్తున్నారన్నారు. రాయలసీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను విస్మరించి వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమొత్తారు. సాగునీటి ప్రాజెక్టులపై అఖిలపక్షాలతో చర్చించకుండా ప్రభుత్వం సొంత నిర్ణయాలతో స్వలాభం కోసం అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో కర్నూలు ఏర్పాటైన జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, లోకాయుక్త, మానవ హక్కుల సంఘం కార్యాలయాలను అమరావతికి తరలిస్తుండటం సీమకు ద్రోహ ం చేయడమేన్నారు. వాటిని ఇక్కడే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కడపలో ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీ ణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అక్కడే కొనసాగించాలని అన్నారు. కార్యక్రమంలో రాయలసీమ సాగునీ టి సాధన సమితి అనంతపురం జిల్లా నాయకులు రాంకుమార్, రైతు సంఘం నాయకులు, రామకృష్ణ, రామచంద్రారెడ్డి, మందా జగన్నాథం పాల్గొన్నారు.
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment