అ‘పూర్వ’ సమ్మేళనం
వెల్దుర్తి: రామళ్లకోట జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. పాఠశాల 1981–82 పదవ తరగతి బ్యాచ్‌తోపాటు 1977 నుంచి 82 వరకు చదువుకున్న చుట్టుపక్కల గ్రామాల వారు సమావేశానికి హాజరయ్యారు. 42 ఏళ్ల తర్వాత కలుసుకున్న బాల్య స్నేహితులందరూ ఒకరినొకరు చూసుకుని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్య, వైవాహిక, ఉద్యోగ జీవిత విశేషాలు, కుటుంబ నేపథ్యాల గురించి ఒకరికొకరు తెలుసుకుంటూ ఆత్మీయంగా గడిపారు. తమకు చదువు చెప్పిన నాటి ఉపాధ్యాయురాలు సుశీలమ్మను సన్మానించారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. నిర్వాహకులుగా సురేంద్రనాథ్, రాముడు, చిన్నయ్య, దస్తగిరి, మియ్యబాష, లలిత, రామస్వామి వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment