తపాలా ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శిగా చంద్రశేఖర్
కోసిగి: ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శిగా కోసిగికి చెందిన చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. ఆదివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మధురలో జరిగిన ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం మహా సభల్లో తనను జాతీయ కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు కోసిగికి చెందిన సీనియర్ తపాలా ఉద్యోగి డి.చంద్రశేఖర్ తెలిపారు.
రాష్ట్రస్థాయికి 22 మంది క్రీడాకారుల ఎంపిక
నంద్యాల(న్యూటౌన్): స్థానిక నంది ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో 22 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు బ్యాడ్మింటన్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వంశీధర్ తెలిపారు. విజేతలకు ఆదివారం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరు ఈనెల 21న విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. అనంతరం క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శేషిరెడ్డి, కోచ్ నాగార్జున పాల్గొన్నారు.
తపాలా ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శిగా చంద్రశేఖర్
Comments
Please login to add a commentAdd a comment