తండ్రిని హతమార్చిన తనయుడు
ఓర్వకల్లు: మద్యం మత్తులో ఓ యువకుడు సొంత తండ్రినే హతమార్చిన ఘటన మండలంలోని నన్నూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామంలోని దళిత కాలనీకి చెందిన గార్ధుల రాములమ్మ, నారాయణ(50)కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కూతురికి పెళ్లి చేశారు. కాగా తమకు ఉన్న 3 ఎకరాల భూమిని విక్రయించాలని పెద్ద కుమారుడు నవీణ్ కొంతకాలంగా తండ్రిపై ఒత్తిడి తెస్తున్నాడు. సరైన ధర రాకపోవడంతో తండ్రి విక్రయించకుండా కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఈక్రమంలో కుటుంబంలో గొడవలు ఏర్పడ్డాయి. దీంతో గత ఏడాది నవీణ్ తన తండ్రి నారాయణ చెవిని కొరికి గాయపరిచాడు. అప్పటి నుంచి తండ్రి, కుమారిడికి తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సాయంత్రం పూటుగా మద్యం తాగిన నవీణ్.. తండ్రితో గొడవకు దిగాడు. మద్యం మత్తులో కర్రతో తలపై మోది, బండరాయితో ముఖంపై కొట్టడంతో నారాయణ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సీఐ చంద్రబాబునాయుడు, ఎస్‌ఐ సునీల్ కుమార్, ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ ఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. నారాయణ మృదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సనీల్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment