పునర్జన్మ నమ్మకాలపై ఆధారం
● ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి
కర్నూలు(హాస్పిటల్): మనిషికి పునర్జన్మలు ఉన్నాయా లేదా అనేది వ్యక్తుల నమ్మకాలపై ఆధార పడి ఉంటాయని, ఆ నమ్మకం మనిషిలో తృప్తి మిగిలిస్తుందని, అదే లేకపోతే మనిషిలో అసంతృప్తి పెరిగిపోయి జీవించినంత కాలం కుంగుబాటుకు గురవుతారని విజయవాడకు చెందిన ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి చెప్పారు. కర్నూలు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం(అలుమ్ని) ఆధ్వ ర్యంలో రెండురోజుల పాటు నిర్వహించిన నిరంతర వైద్య విజ్ఞాన సదస్సు, అలుమ్ని మీట్ ఆదివారం ముగిశాయి. ఈ కళాశాలలో చదివి దేశ,విదేశాల్లో స్థిరపడిన ప్రముఖ వైద్యులు స్పెషాలిటీ, సూపర్‌స్పెషాలిటీ అంశాలపై సబ్జెక్టుల్లో ఆధునిక వైద్యవిధానాలు, అభివృద్ధి గురించి వివరించారు. పునర్జన్మలు – నమ్మకాల గురించి డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడారు. పునర్జన్మలపై కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నా సరైన ఫలితాలు కనిపించడం లేదన్నారు. పునర్జన్మలపై తీసిన సినిమాలు మాత్రం సూపర్‌హిట్ అవుతున్నాయని, దీనిని బట్టి మనుషులకు వాటిపై ఎంతటి నమ్మకం ఉందో అర్థం అవుతుందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు మల్లికార్జున గోఖలే, సదాశివారెడ్డి, సంపత్, ప్రసాద్‌బాబు, గణేష్, చందనారెడ్డి, డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, డాక్టర్ నరసింహులు, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కుమారస్వామిరెడ్డి, సెక్రటరి డాక్టర్ బాలమద్దయ్య, ట్రెజరర్ డాక్టర్ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment