18 నుంచి లాంగ్వేజ్ ఫెస్టివల్స్
కర్నూలు కల్చరల్: జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు లాంగ్వేజ్ ఫెస్టివల్స్ నిర్వహించాలని డీఈఓ శామ్యూ ల్ పాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీఎస్‌ఎస్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 18న ఇంగ్లిష్, 19న సంస్కృతం, హిందీ, ఉర్దూ, 20న గిరిజన బాషా, కన్నడ, తమిళం, ఒరియా, 21న తెలుగు బాషా ఉత్సవాలను నిర్వహించాలని తెలిపారు. ఆదోని డివిజన్ పరిధిలో కన్నడ భాషాకృత్యాలను నిర్వహించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు పఠన పోటీలు, కథ చెప్పడం లాంటి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈ నెల 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ కార్యక్రమాలు పండుగలా నిర్వహించాలని పేర్కొన్నారు.
మల్లన్నకు నృత్యనీరాజనం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల ఆలయ నిత్యకళావేదికపై ఆది వారం విజయవాడకు చెందిన నర్తన డ్యాన్స్ అకాడమీ వారి సంప్రదాయ నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. గణపతి ప్రార్థన, శివాష్టకం, శివోహం, శంకర శ్రీగిరివాసా తదితర గీతాలకు, అష్టకాలకు.. సత్యశ్రీ, భవ్య, లహరి తదితరులు నృత్యం ప్రదర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment