ఉద్యోగులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుం
కర్నూలు(అర్బన్)/నంద్యాల(న్యూటౌన్): ‘ఆప్కాస్’ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. తిరిగి పాత విధానం అమలైతే తమ పరిస్థితి ఏమిటనే ప్రశ్న వారిని తొలచివేస్తోంది. ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు. తమ వారికి ఆయా ఉద్యోగాలు కట్టబెట్టేందుకుమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆప్కాస్ పరిధిలో ఉన్న ఉద్యోగులను తొలగించేందుకు వీలు లేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తమకు అనుకూలమైన ఏజెన్సీల విధానాన్ని తీసుకువచ్చేందుకు కుట్రలు పన్నుతున్నారు.
గతంలోఅవినీతి, అక్రమాలు
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తూ వచ్చారు. ఇందులో మితిమీరిన రాజకీయ జోక్యంతో అర్హులకు న్యాయం జరిగేది కాదు. అడ్డగోలుగా మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసులతో నియామకాలు జరిగేవి. ప్రజాప్రతినిధుల సిఫారసులతో పాటు ప్రతి ఉద్యోగానికి ఒక రేటు ప్రకారం రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు ఆయా ఏజెన్సీలు నిరుద్యోగుల నుంచి భారీగానే డబ్బులు వసూలు చేశారు. అయినా అప్పట్లో ఆయా ఏజెన్సీలు తమ ఖాతాలోకి జమ అయిన వేతనాలను సకాలంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లించకపోవడం, ఈపీఎఫ్‌ను సక్రమంగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయకపోవడం వల్ల అనేక మంది పలు రకాల ఇబ్బందులకు గురయ్యారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా, విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించిన చిరుద్యోగులను కూడా రాజకీయ జోక్యంతో తొలగించిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
వైఎస్సార్‌సీపీ హయాంలో ఇలా చేశారు..
అనేక ఇబ్బందులు, ఒడిదుడుకుల మధ్య జీవితాలను వెళ్లదీస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ‘ఆప్కాస్’ను ఏర్పాటు చేసింది. ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు భిన్నంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే వేతనాలను వారి ఖాతాల్లో జమ చేసేందుకు నిర్ణయం తీసుకొని, అమలు చేసింది. అలాగే వేతనానికి ముందే ఈపీఎఫ్ సక్రమంగా జమ చేసే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తిరిగి ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసి పాత విధానంలో ఏజెన్సీలకు పగ్గాలు అప్పగించేందుకు పూ నుకోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఉద్యోగులు నష్టపోతారు
ఆప్కాస్‌ను రద్దు చేసి ఏజెన్సీల విధానం అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం మంచిది కాదు. దీనివల్ల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నష్టపోతారు. మితిమీరిన రాజకీయ జోక్యంతో ఉద్యోగ భద్రత ఉండదు. ఈపీఎఫ్ డబ్బులు గతంలో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయకుండా ఏజెన్సీలు కాజేసిన ఘటనలు ఉన్నాయి. ప్రభుత్వం పునరాలోచించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్టు పరిధిలోకి తీసుకురావాలి. నేరుగా ఆయా శాఖాధిపతులతో జీతాలు చెల్లించాలి.
– నాగరాజు, సీఐటీయూ నంద్యాల జిల్లా కార్యదర్శి
చిరుద్యోగుల జీవితాలు చిన్నాభిన్నం
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడు నెలల్లో అనేక రూపాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పలు రకాల ఆదాయ వనరులు కల్పించారు. తాజాగా అవుట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై పడింది. గతంలో ప్రతి ఉద్యోగానికి ఒక ధర ఫిక్స్ చేసి మరీ వసూలు చేసిన ఏజెన్సీలను తిరిగి తెరపైకి తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతో పారదర్శకంగా కొనసాగుతున్న ఈ వ్యవస్థపై పాత విధానాన్ని రుద్దేందుకు పూనుకుంటోంది. ఇదే జరిగితే ప్రతి జిల్లాలో వందల మంది చిరుద్యోగుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చు. తక్కువ వేతనంతో ఎక్కువ పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆర్థికంగా చేయూతను అందించాల్సింది పోయి, వారి ఉద్యోగాల్లో వేలు పెట్టడం సరైన చర్య కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘ఆప్కాస్’ రద్దుపై ఉద్యోగుల్లో వ్యతిరేకత
రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై ఆందోళన
సజావుగా సాగుతున్న వ్యవస్థను
నిర్వీర్యం చేసే కుట్ర
ఏజెన్సీల పరిధిలోకి అవుట్ సోర్సింగ్
ఉద్యోగులను తెచ్చేందుకు కసరత్తు
టీడీపీ కార్యకర్తలకు
మేలు చేసేందుకు పన్నాగం
ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లోని
ఖాళీలపై టీడీపీ నేతల ఆరా
పాత విధానం వద్దంటున్న
చిరుద్యోగులు
ఉద్యోగులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుం
ఉద్యోగులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుం
Comments
Please login to add a commentAdd a comment