ఉపాధి నిధుల వినియోగంపై ఆడిట్
కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల వినియోగంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆడిట్ విభాగం బృందం తనిఖీలు చేపట్టింది. సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ రాజేష్‌కుమార్ నేతృత్వంలో సోమవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2021–22, 2022–23, 2023–24 సంవత్సరాల్లో మెటీరియల్, లేబర్ కాపోనెంటు కింద చేపట్టిన నిధుల వినియోగంపై ఈ టీమ్ ఆడిట్ నిర్వహిస్తోంది. కేంద్రం నుంచి వచ్చిన ఆడిట్ బృందాన్ని హోటల్ త్రిగుణలో జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య, అదనపు పీడీ మాధవీలత, పరిపాలన అధికారి విజయలక్ష్మి, ఫైనాన్స్ మేనేజర్ అదెయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ నామ్స్ ప్రకారం ఉపాధి నిధులు వినియోగించారా లేదా అనే దానిని ఈ టీమ్ పరిశీలిస్తుంది. సోషల్ ఆడిట్, దుర్వినియోగం అయిన నిధుల రికవరీ తదితర వాటిని పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు.
బోదకాల బాధితులకు కిట్ల పంపిణీ
కర్నూలు(హాస్పిటల్): బోదకాలుతో బాధపడుతున్న ముగ్గురికి మార్బిడిటీ మానిటరింగ్ కిట్(టబ్, మగ్, సబ్బు, ఆయింట్‌మెంట్, టవల్)ను, అవసరమైన మాత్రలను అధికారులు అందజేశారు. సోమవారం స్థానిక జొహరాపురంలోని యూపీహెచ్‌సీలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి. శాంతికళ మాట్లాడుతూ జిల్లాలో 22 మంది బోధకాలు వ్యాధిగ్రస్తులు ఉన్నారని, వీరు తరచుగా వ్యాధిసోకిన కాలును టబ్‌లో ఉంచి సబ్బు నీటితో శుభ్రంగా కడిగి టవల్‌తో తుడిచిన తర్వాత ఆయింట్‌మెంట్ పట్టించాలని సూచించారు. ఈ వ్యాధి ఆడ క్యూలెక్స్ దోమకాటుతో వ్యాపిస్తుందని, నివారణ చర్యల్లో భాగంగా దోమకాటుకు గురిగాకుండా దోమతెరలు వాడాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి నూకరాజు, యుపీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక, ఏఎంవో చంద్రశేఖర్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
గ్రూపు–2 మెయిన్స్‌కు
పకడ్బందీ ఏర్పాట్లు
కర్నూలు(సెంట్రల్): ఈనెల 23వ తేదీన గ్రూపు–2 మెయిన్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఏపీపీఎస్‌సీ జిల్లా కోఆర్డినేటర్, జేసీ డాక్టర్ బి.నవ్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో గ్రూపు–2 పరీక్షలపై జిల్లా అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్షకు ఏర్పాట్లు చేయాలన్నారు. లైజెన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు.
నేటి నుంచి అంగన్‌వాడీ
టీచర్లకు శిక్షణ
కర్నూలు కల్చరల్: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జిల్లాలోని అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ ఇస్తున్నట్లు సమగ్ర శిక్ష ఏపీసీ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం వాటి కి సంబంధించిన కిట్లను అంగన్వాడీలకు పంపిణీ చేసి మాట్లాడారు. జ్ఞాన జ్యోతి కార్యక్రమం ద్వా రా పూర్వ ప్రాథమిక విద్య ప్రాముఖ్యతను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. శిక్షణకు సంబంధించి జిల్లాకు వచ్చిన 1,882 కిట్ల ను ఇప్పటికే మండలాలకు సరఫరా చేశామన్నారు
25 నుంచి యాగంటిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు
బనగానపల్లె: యాగంటిలో ఈనెల 25 నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ చంద్రుడు సోమవారం తెలిపారు. 25న ధ్వజారోహణంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 26న ఉదయం మహాన్యాస పూర్వ క రుద్రాభిషేకం, రాత్రి లింగోద్భవ కాల పూజ , 27న నందికోల , 28 సాయంత్రం రథోత్సవం, మార్చి 1న రుద్రాభిషేకం ఉంటాయన్నారు.
ఉపాధి నిధుల వినియోగంపై ఆడిట్
Comments
Please login to add a commentAdd a comment