కూటమి ప్రభుత్వంలో నిబంధనలకు తూట్లు
కర్నూలు(సెంట్రల్): కూటమి ప్రభుత్వం నిబంధనలకు తూట్లు పొడుస్తోందని, తమను ఉత్సవ విగ్రహాలుగా మార్చి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కార్యకర్తలకే వివిధ అభివృద్ధి పనులు అప్పగిస్తుందని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) కార్యక్రమం జరిగింది. కలెక్టర్ పి.రంజిత్‌బాషా, జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సత్యనారాయణమ్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరైన ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కలిసి ఉపాధి హామీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను గ్రామ, మండల పరిషత్‌లు, పురపాలక సంఘాల అనుమతులతో జరిగేలా చూడాలని కోరారు. కూటమి నాయకుల తీరుపై తాము హైకోర్టును ఆశ్రయించగా నిబంధనలు ప్రకారం చేపట్టాలని ఆదేశాలు ఇచ్చిందని, అయితే, స్థానిక అధికారులు పట్టించుకోవడంలేదని వాపోయారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు కలగజేసుకోవాలని గూడూరు మునిసిపల్ వైస్ చైర్మన్ అస్లాం కోరారు. లేకపోతే తాము మరోసారి కోర్టును ఆశ్రయిస్తామన్నారు.
వినతుల్లో మరి కొన్ని...
●వికలాంగులకు ఉపాధి హామీ పథకంలో 150 రోజులపాటు పనులు కల్పించి 30 శాతం అలవెన్స్ ఇవ్వాలని కల్లూరు మండలం పర్లకు చెందిన 40 మంది దివ్యాంగులు వినతిపత్రం అందించారు.
● తనకు చెందిన 25 సెంట్ల భూమిని కురువ లక్ష్మన్న కుమారులైన పంపన్న, కేశవ, నాగేంద్ర దౌర్జన్యంగా ఆక్రమించుకొని సాగు చేసుకుంటు న్నారని పెద్దకడబూరు మండలం కంబలదిన్నెకు చెందిన బింగి నరసన్న అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
● 2013వ సంవత్సరంలో కల్లూరు మండలం బి.తాండ్రపాడు, మారుతీ నివాస్ కాలనీలకు నీటి కుళాయిల కోసం రూ. 90వేలు చెల్లించామని, అయితే ఇంతవరకు అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాలకు చెందిన 30 మంది ప్రజలు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.
పీజీఆర్‌ఎస్‌లో అధికారులకు
విన్నవించిన స్థానిక సంస్థల
ప్రజాప్రతినిధులు
గ్రామ, మండల పరిషత్‌ల
అనుమతులతోనే ఉపాధి పనులు
చేపట్టాలని విజ్ఞప్తి
Comments
Please login to add a commentAdd a comment