కిడ్నాప్ చేసి ప్రాంసరీ నోటు రాయించుకున్నారు
● జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు
కర్నూలు: పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని పోల్‌కల్ గ్రామానికి చెందిన సుంకన్న, శాంసన్ మరికొందరు కలసి తనను కిడ్నాప్ చేసి రూ.1.50 లక్షలకు కర్నూలు కొత్త బస్టాండు దగ్గర ప్రాంసరీ నోటు రాయించుకొని వదిలేశారని, ఈ సంఘటనపై విచారణ జరిపి తగు న్యాయం చేయాల్సిందిగా కర్నూలు సోమిశెట్టి నగర్‌కు చెందిన రాజు ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. కర్నూలు టూటౌన్ పోలీసు స్టేషన్ పక్కన ఉన్న క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 102 ఫిర్యాదులొచ్చాయని, వీటిపై విచారణ జరిపి చట్టపరిధిలో త్వరితగతిన న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్‌పీరా, ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ, సీఐలు శ్రీనివాసనాయక్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని...
● వ్యవసాయ శాఖలోని కో–ఆపరేటివ్ సొసైటీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి వెంకటాపురం గ్రామానికి చెందిన శేఖర్,సుధాకర్ రూ.3.50 లక్షలు తీసుకొని మోసం చేశారని దేవనకొండ మండలం బేతాపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్‌రెడ్డి ఎస్పీ ఎదుట వాపోయాడు
● హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని కర్నూలుకు చెందిన వీరస్వామి రూ.8 లక్షలు నగదు, 5 తులాల బంగారం తీసుకొని మోసం చేశారని కర్నూలు ఆర్‌కే స్ట్రీట్‌కు చెందిన నాగరాజు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment