అవగాహనతోనే సైబర్ నేరాల కట్టడి
కర్నూలు: అవగాహనతోనే సైబర్ నేరాలను కట్టడి చేయవచ్చని ఏపీ పరిశ్రమల మంత్రి టీజీ భరత్ అన్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో సోమవారం ఆర్‌ఎస్ రోడ్డులోని కేవీఆర్ కళాశాలలో విద్యార్ధినులకు ‘నేను సైబర్ స్మార్ట్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి టీజీ భరత్ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరై సైబర్ నేరాల నివారణకు, అవగాహనకు పోస్టర్లు, వీడియోలు ఆవిష్కరించి మాట్లాడారు. ఇటీవల సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాల నివారణకు అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఎస్పీ మాట్లాడుతూ... ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే టోల్‌ఫ్రీ నంబరు 1930కి కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో కేవీఆర్ కళాశాల ప్రిన్స్‌పాల్ వీవీ సుబ్రహ్మణ్యకుమార్, క్లస్టర్ యూనివర్సిటీ వీసీ డీవీఆర్ సాయిగోపాల్, రిజిస్ట్రార్ కట్టా వెంకటేశ్వర్లు, అడ్మిన్ అడిషన్ ఎస్పీ హుసేన్‌పీరా, కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్, పాల్గొన్నారు.
‘నేను సైబర్ స్మార్ట్’ అవగాహన
కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్
Comments
Please login to add a commentAdd a comment