మకర తోరణం, అఖండ దీపం విరాళం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానానికి భక్తులు మకర తోరణం, అఖండ దీపం విరాళంగా అందించారు. కృష్ణా జిల్లాకు చెందిన యం.రామచంద్రరావు, కుటుంబ సభ్యులు రూ.24,45,000 ఖర్చు చేసి బంగారు పూతతో తయారు చేయించిన మకరతోరణాన్ని, తెనాలికి చెందిన కొడాలి కృష్ణ చైతన్య రూ.8,46,000 ఖర్చు చేసి 8 కేజీల వెండితో తయారు చేయించిన అఖండ దీపాన్ని సోమవారం ప్రధానార్చకులు కె.శివప్రసాదస్వామి, యం.ఉమానాగేశ్వరశాస్త్రి, పర్యవేక్షకులు సి.మధుసూదన్‌రెడ్డి, కె.అయ్యన్న, ఆలయ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జునరెడ్డికి అందజేశారు. దాతలకు స్వామివార్ల శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment