కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా ట్రెజరీ కార్యాలయం, సబ్ ట్రెజరీల్లో 2023–24 సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలపై అకౌంటెంటు జనరల్ (ఏజీ) ఆడిట్‌కు సోమవారం శ్రీకారం చుట్టారు. సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ జి.రాజశేఖర్, అసిస్టెంటు అకౌంట్స్ ఆఫీసర్ డి.లక్ష్మణ్ కుమార్, అసిస్టెంట్ సూపర్ వైజర్ మోహన్‌రావులతో కూడిన బృందం ఈ నెల 17 నుంచి 2 వరకు జిల్లా ట్రెజరీ, కర్నూలు డివిజన్ సబ్ ట్రెజరీ కార్యాలయాలు, ఈ నెల 22 నుంచి 25 వరకు ఆదోని డివిజన్ సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో ఆడిట్ చేపడుతుంది. పెన్షన్ చెల్లింపులు, స్ట్రాంగ్ రూము, చెల్లింపులు, జమలు తదితర వాటిని ఏజీ టీమ్ ఆడిట్ చేసుందని జిల్లా ట్రెజరీ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment