కూటమి ప్రభుత్వంలో రాయలసీమకు అన్యాయం
కర్నూలు (సెంట్రల్): కూటమి ప్రభుత్వంలో రాయలసీయ, ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. సోమవారం కర్నూలులోని సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నిధులన్నీ అమరావతి, పోలవరంలకే కేటాయించి సీమ, ఉత్తరాంధ్రకు సీఎం చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతాల్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వచ్చే బడ్జెట్‌లోరూ.30 వేలకోట్లను కేటాయించాలన్నారు. కృష్ణానది బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారం కోసం ఈనెల 19న వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, నాయకులు రామాంజనేయులు, రామకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment