పదిపై పర్యవేక్షణ కరువు
పర్యవేక్షణ చేయాలని
ఆదేశాలు ఇచ్చాం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో డిప్యూటీ డీఈఓలుగా ఎంఈఓ–1లు ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారు. ఉన్నత పాఠశాలలను పర్యవేక్షణ చేయాలని ఆదేశాలు ఇచ్చాం. పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పాం. ఎంఈఓలుగా ఖాళీగా ఉన్న అర్హులైన హెచ్‌ఎంకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించాం. రివిజన్ టెస్ట్‌లు నిర్వహించి, ఇందులో వచ్చిన ఫలితాల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులకు మరో సారి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని చెప్పాం.
– ఎస్.శామ్యూపాల్, డీఈఓ
కర్నూలు సిటీ: పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు నామమాత్రమే అన్న విమర్శలు వస్తున్నాయి. పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించడంలో డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు, హెచ్‌ఎంలది కీలక పాత్ర. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నత పాఠశాలలను పర్యవేక్షణ చేయాల్సిన డిప్యూటీ డీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ఇవీ సమస్యలు..
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 1,022 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 17 నుంచి మొదలు కానున్న పదవ తరగతి పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 64,099 మంది హాజరుకానున్నారు. మొత్తం 17 ఎంఈఓ, 4 డిప్యూటీ డీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన ఆత్మకూరు, పత్తికొండ డివిజన్లకు సైతం డిప్యూటీ డీఈఓలు లేరు. అలాగే 40 జెడ్పీ హైస్కూళ్లలో రెగ్యులర్ ప్రధానోపాధ్యాయులు లేరు. ఉన్నత పాఠశాలలపై డిప్యూటీ డీఈఓల పర్యవేక్షణ కీలకం. ప్రస్తుతం ఎంఈఓ–1లకు ఇన్‌చార్జ్ డిప్యూటీ డీఈఓ బాధ్యతలు అప్పగించారు.
● ప్రస్తుతం క్లస్టర్ విధానం, అపార్, టీఐఎస్(టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్)లతో రెగ్యులర్ పోస్టుల పనితోనే సమయం సరిపోని పరిస్థితి. ఇన్‌చార్జ్ బాధ్యతలతో ఉన్నత పాఠశాలలను తనిఖీలు చేయలేకపోతున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో రోజుకొక ఫార్మాట్‌లలో సమాచారం ఇవ్వాలని చెప్పడంతో డివిజనల్, మండల అధికారులపై పని భారం పెరిగిపోయింది.
● గతంలో ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకునేవారు. విద్యార్థులను చదివించే బాధ్యత వారికి అప్పగించే వారు. పర్యవేక్షణకు మండలాల ప్రత్యేకాధికారులకు సైతం ఉండేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా అగుపించడం లేదు.
● డీఈఓలకు ప్రతి రోజు నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు వీడియో కాన్ఫరెన్స్, వెబెక్స్, టెలీ కాన్ఫరెన్స్‌లతోనే సమయం సరిపోతోంది.
● సబ్జెక్టు నిపుణులు ఉన్నప్పటికీ ఈ–లెర్నింగ్ తరగతులకే పరిమితం అవుతున్నారు.
ఆలస్యంలో ‘ప్రత్యేక’ం
పదవ తరగతి పరీక్షలు నెల రోజుల్లో మొదలు కానున్నాయి. గతంలో కంటే ఫలితాలను పెంచాలని లక్ష్యంతో విద్యాశాఖ ఉన్నతాఽధికారులు ప్రత్యేకంగా వంద రోజుల ప్రణాళికను తయారు చేయించారు. అన్ని జిల్లాల్లో అదే ప్రణాళికను అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సబ్జెక్టు టీచర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆయా సబ్జెక్టుల్లో 100 శాతం ఫలితాలు సాధించేలా వర్చువల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయించి ఈ–లెర్నింగ్‌కు చర్యలు చేపట్టారు. అయితే ఆ చర్యలు ఆలస్యంగా మొదలయ్యాయి. గతంలో సీ, డీ క్యాటగిరీలకు చెందిన పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటిరియల్ ఇచ్చే వారు. ప్రస్తుత ప్రభుత్వం పరీక్షల విభాగం తయారు చేసిన మోడల్ ప్రశ్న పత్రాలు, బిట్ బ్యాంకును పీడీఎఫ్ రూపంలో హైస్కూళ్ల హెచ్‌ఎంలకు పంపించారు. కానీ విద్యార్థులకు ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో ఈ ఏడాది ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికై నా ఉన్నత పాఠశాలలపై పర్యవేక్షణ పెంచితే మంచి ఫలితాలు వస్తాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
వచ్చే నెల 17 నుంచి మొదలు
కానున్న పదో తరగతి పరీక్షలు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆరు
డిప్యూటీ డీఈఓ పోస్టులు ఖాళీ
17 మండలాలకు
ఇన్‌చార్జ్ ఎంఈఓలు
40 ఉన్నత పాఠశాలల్లో
హెచ్‌ఎం పోస్టులు ఖాళీ
ఆలస్యంగా మొదలైన ఈ–లెర్నింగ్
Comments
Please login to add a commentAdd a comment