విజ్ఞాన మేళా.. విద్యార్థులు భళా!
కర్నూలు కల్చరల్: విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి అద్భుత ఆవిష్కరణలు ఆవిష్కరించారు. ఇందుకు కర్నూలులోని జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వేదిక అయ్యింది. కళాశాల ఏర్పాటు చేసి 40 సంవత్సరాల పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సోమవారం నుంచి శనివారం రూబీ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుకుంటున్నారు. అందులో భాగంగా మూడురోజుల పాటు నిర్వహించనున్న విజ్ఞాన మేళా 4.ఓ సోమవారం ప్రారంభమైంది. విజ్ఞాన మేళాను కళాశాల పూర్వ విద్యార్థి, ఏఐఎస్ అధికారి, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి. మురళీధర్ రెడ్డి, కళాశాల చైర్మన్ సుబ్బారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలను వీరు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. విజ్ఙాన మేళాలో మొత్తం 110 ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేశామన్నారు. జీపీఆర్‌ఈసీ నుంచి 58, జిల్లాలోని 15 పాఠశాలల నుంచి 33, చైన్నె ట్రిపుల్ ఐటీ, కర్నూలు ఐఐటీ డీఎం నుంచి ఒకటి, సీఎంఆర్ కళాశాల నుంచి 15 ప్రదర్శనలు వచ్చాయన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ మేళాను అందరూ సందర్శించి, విజ్ఞానం పెంచుకోవచ్చన్నారు. ప్రదర్శనలో సోలార్ పవర్డ్ హైబ్రిడ్ ఈ బైసైకిల్, మిషన్ అన్వేషన్, స్మార్ట్ గ్లాసెస్ ఫర్ బ్‌లైండ్ పీపుల్, రోబోటిక్ సిస్టమ్ ఫర్ బోర్‌వెల్ రెస్క్యూ ఆపరేషన్, ప్రోటో టైప్ డ్యామ్ ఆకట్టుకున్నాయి.
విజ్ఞాన మేళా.. విద్యార్థులు భళా!
విజ్ఞాన మేళా.. విద్యార్థులు భళా!
Comments
Please login to add a commentAdd a comment