రైతుకో నేలబావి!
ఇప్పుడైతే బోరు బావులు వేయడం పరిపాటిగా మారింది. కానీ కొన్నేళ్ల క్రితం నేల బావులే రైతులకు ఆధారం. అందులో నంద్యాల మండల పరిధిలోని పెద్దకొట్టాల గ్రామ పరిధిలో దాదాపు 70 నేల బావులుండేవి. వ్యవసాయ సాగుతో పాటు అన్ని అవసరాలకూ వాటినే ఉపయోగించుకునేవారు. తెలుగుగంగ, పాలేరు సాగునీటి రాకతో వాటి అవసరం కాస్త తగ్గినా కొందరు రైతులకు మాత్రం అవే వ్యవసాయానికి ఉపయోగపడుతున్నాయి. ఇక ఇదే గ్రామంలో ఇళ్ల పరిసరాల్లోనూ నేల బావులుండేవి. కాలక్రమేణా కొందరు పూడ్చి వేయగా.. మరికొన్ని కంప చెట్లు మొలిచి శిథిలావస్థకు చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment