భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం
ఆదోని టౌన్: భారీగా కర్ణాటక మద్యాన్ని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరా వు తెలిపిన వివరాలు.. ఆలూరు నుంచి బొలేరో వా హనంలో 80 బాక్సులు కర్ణాటక టెట్రా ప్యాకెట్ల లోడుతో ఆదోనికి వస్తుండగా మహాయోగి లక్ష్మమ్మ ఆర్చ్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.3.50 లక్షల దాకా ఉంటుందని అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. కర్ణాటక మద్యం తరలిస్తున్న బాషా,అజయ్‌కుమార్‌లను అదుపులోకి తీసుకోగా, నాగిరెడ్డి పరార్ అయ్యాడన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
సంగాల గ్రామ సమీపంలో ..
ఆలూరు రూరల్: అక్రమంగా తరలుతున్న కర్ణాటక మద్యాన్ని మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ సీఐ లలిత తెలిపిన వివరాలు.. చిప్పగిరి మండలం సంగాల గ్రామ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఆలూరు మండలం మొలగవల్లి గ్రామానికి చెందిన ఎరుకల కృష్ణ స్కూటర్‌పై వెళ్తుండగా ఆపి తనిఖీ చేశారు. 7 బాక్సుల కర్ణాటక మద్యం 672 టెట్రా ప్యాకెట్లు (90 ఎంఎల్) గుర్తించి స్వాఽధీనం చేసుకున్నారు. స్కూటర్ సీజ్ చేసి, నిందితుడు కృష్ణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తనిఖీలో ఎస్‌ఐ నవీన్‌బాబు, సిబ్బంది మాలవ్య, సూర్యప్రకాష్, లక్ష్మమ్మ సోమేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment