మహిళలకు ఉచిత వైద్యశిబిరం
కర్నూలు(అగ్రికల్చర్): అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మహిళా ఉద్యోగులు, మహిళా ఖాతాదారులు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించినట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) రీజినల్ ఆఫీసు హెడ్ పి.నరసింహరావు తెలిపారు. సాధారణ ఆరోగ్య సమస్యలకు ఓమిని హాస్పిటల్ వైద్యులు, దంత సమస్యలపై స్మైల్ డెంటల్ కేర్ డాక్టర్లు, కంటి సమస్యలకు సుశీల నేత్రాలయ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ హెడ్స్ సురేంద్రగౌడు, ఎన్‌వీ అనంతకుమర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment