పరీక్షల నిర్వహణలో పొరపాట్లకు తావివ్వొద్దు
కర్నూలు కల్చరల్: ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. గురువారం పరీక్షలు నిర్వహిస్తున్న ఓల్డ్‌సిటీలోని ఉస్మానియా కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 1వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా 69 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఇంటర్ విద్యార్థులు మొత్తం 45,325 మంది పరీక్షలు రాస్తున్నారన్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామన్నారు. పోలీస్ బందోబస్తు సైతం ఏర్పాటు చేశామన్నారు. ఆర్‌ఐవో గురవయ్య శెట్టి మాట్లాడుతూ గురువారం మొదటి సంవత్సరం విద్యార్థులు 25,250 మందికి 24, 495 మంది హాజరు కాగా 744 మంది గైర్హాజరయ్యారన్నారు. కర్నూలు బీక్యాంప్ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో చూచిరాతకు పాల్పడిన ఆరుగురు విద్యార్థులను డిబార్ చేశామన్నారు.
జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా
Comments
Please login to add a commentAdd a comment