కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డా.బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల/ కళాశాలల్లో 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 13వ తేదీ వరకు గడువును పొడిగించినట్లు ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇన్‌స్పైర్ అవార్డులకు 9 ప్రాజెక్టులు ఎంపిక ...
2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన ఇన్‌స్పైర్ అవార్డులకు జిల్లాలోని డా.బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థులు రూపొందించిన 9 ప్రాజెక్టులు ఎంపిక అయ్యాయని డీసీఓ శ్రీదేవి తెలిపారు. అలాగే టీసీఎస్ నిర్వహించిన గ్లోబల్ ఇన్నోవేటర్ ఆఫ్ ద ఇయర్ (జీఓఐటీ) కాంపిటీషన్స్‌లో 373 ప్రాజెక్టుల్లో ఫైనల్‌కు మూడు ఎంపిక అయ్యాయన్నారు. ఇందులో కర్నూలు జిల్లాలోని దిన్నెదేవరపాడు గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉండటం హర్షణీయమన్నారు. ఈ విద్యార్థులు ఈ నెల 25వ తేదీన వర్చువల్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment