బర్త్ డే పార్టీ మిగిల్చిన విషాదం
● రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీ గార్డు మృతి
కర్నూలు (హాస్పిటల్): పుట్టిన రోజు వేడుక స్నేహితుల్లో విషాదాన్ని నింపింది. విందు పూర్తి చేసుకుని తిరుగుపయణమైన స్నేహితులలో ఒకరిని రోడ్డుప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. నగర శివారు పంచలింగాల చెక్‌పోస్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దాస్పత్రి సెక్యూరిటీ గార్డు కొమ్ము మహేష్ (25) మృతిచెందాడు. మహేస్‌తోపాటు విష్ణువర్ధన్, రాజేంద్రసింగ్, తిరుమలేష్ పెద్దాస్పత్రిలో సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. విష్ణువర్ధన్ పుట్టిన రోజు కావడంతో వీరు నలుగురు గురువారం విధులకు సెలవు పెట్టి అలంపూర్‌కు వెళ్లారు. అక్కడ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని మధ్యాహ్నం ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. పంచలింగాల చెక్‌పోస్టు సమీపంలోకి రాగానే వారి ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం పెద్దాస్పత్రికి తరలించగా కోలుకోలేక మహేష్ మృతిచెందాడు. బంగారుపేటకు చెందిన ఇతడికి భార్య, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా క్షతగాత్రులను ఆసుపత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సీతారామయ్య పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment