అన్ని వ్యాధులకూ వైద్యం చేస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

అన్ని వ్యాధులకూ వైద్యం చేస్తున్నాం

Published Fri, Mar 7 2025 9:54 AM | Last Updated on Fri, Mar 7 2025 9:49 AM

అన్ని

అన్ని వ్యాధులకూ వైద్యం చేస్తున్నాం

వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో అన్నిరకాల వైద్యసేవలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వెటర్నటీ, ఆర్థోపెడిక్‌, డెంటల్‌, ఈఎన్‌టీ తదితర విభాగాలలో ఇక్కడే వైద్యులు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. 80 శాతం రోగాలకు ఎక్కడకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడే వైద్యం అందిస్తాం.

– డాక్టర్‌ హనీఫ్‌, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌, డోన్‌

డోన్‌ వంద పడకల ప్రభుత్వాసుపత్రి

మణికట్టు వద్ద

ప్లేట్‌ వేసి శస్త్రచికిత్స

శ్రీనివాసనగర్‌కు చెందిన నగేష్‌ మణికట్టు వద్ద ప్రమాదవశాత్తూ గాయం తగిలి తిరగతోడింది. దీనిని ఫ్రాక్చర్‌ షప్ట్‌ రౌస్‌గా గుర్తించి ఆరిఫ్‌ విత్‌ ప్లాస్టింగ్‌ శస్త్రచికిత్స ద్వారా ప్లేట్లు విజయవంతంగా అమర్చారు. దీంతో అతను సంపూర్ణంగా కోలుకొని తన పని తాను చేసుకోగలుగుతున్నారు.

తెగిన కాలి మడిమకు చికిత్స

కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామానికి చెందిన చంద్రకళ కట్టెలు కొడుతుండగా కుడికాలు మడిమ వద్ద నరం తెగి తీవ్ర రక్తస్రావమైంది. కొందరు డాక్టర్లు యుద్ధ ప్రాతిపదికన కుట్లు వేసి పంపించడంతో గాయం తిరగతోడింది. దీంతో ఆమె ప్రభుత్వాసుపత్రిలో వైద్యులను సంప్రదించింది. టెండో అచిలిస్‌ టెండర్‌ టియర్‌గా గుర్తించి అత్యవసర చికిత్స చేశారు.

డోన్‌ మండలం చింతలపేట గ్రామానికి చెందిన చంద్రుడు, రితికలకు ఆరు నెలల క్రితం కూతురు పుట్టింది. అయితే చిన్నారి వంకర పాదాలు(క్లబ్‌ ఫుట్‌)తో జన్మించడంతో దంపతులు ఆవేదన చెందారు. తమ బిడ్డను తీసుకుని డోన్‌ ప్రభుత్వాస్పత్రికి వెళ్లగా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హనీఫ్‌, ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ గౌస్‌ పోనిశెట్టి కాస్టింగ్‌ టెనోటోమి చికిత్స ద్వారా వంకర కాళ్లను సరిచేశారు. డాక్టర్లు తమ బిడ్డ పాదాలు సరిచేయకపోతే జీవితాంతం వికలాంగత్వంతో బాధపడేదని, వైద్యులకు ఆజన్మాంతం తమ కుటుంబం ఋణపడి ఉంటుందని దంపతులు చంద్రుడు, రితిక దంపతులు పేర్కొన్నారు.

ప్రభుత్వాసుపత్రిలో క్లిష్ట మైన

శస్త్రచికిత్సలు

కార్పొరేట్‌ వైద్యం అందుతుండటంతో

రోగులు ఆనందం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చొరవతో

పేదలకు తప్పిన కష్టాలు

అన్నిరకాల శస్త్రచికిత్సలను త్వరలో

అందుబాటులోకి తెస్తాం

గత ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పేదలకు అధునాతన వైద్యం అందుతోంది. జిల్లా కేంద్రానికో, ఏ ఇతర ప్రాంతాలకో వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే అన్ని వ్యాధులకూ అత్యంత ఖరీదైన వైద్యం ఉచితంగా లభిస్తోంది. ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి పేదల డాక్టర్‌గా వైఎస్‌ఆర్‌ పేరు పొందగా.. ఆయన బిడ్డ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విన్నపం మేరకు రూ.40 కోట్లతో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేసి, వేల మందికి వైద్యం అందించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు గాంచారని డోన్‌ నియోజకవర్గ ప్రజలు వేనోళ్ల పొగుడుతున్నారు.

డోన్‌: నంద్యాల జిల్లా డోన్‌ పట్టణం గుత్తి రోడ్డు పక్కన ఉన్న రుద్రాక్షగుట్ట ప్రాంతంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చొరవతో రూ.40 కోట్లు వెచ్చించి అత్యంత ఆధునిక వంద పడకల ప్రభుత్వాసుపత్రిని నిర్మించారు. ప్యాపిలి, డోన్‌, బేతంచెర్ల, పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, వెల్దుర్తి, కృష్ణగిరి, దేవనకొండ మండలాల పేదలకు ఈ ఆసుపత్రి ద్వారా వైద్య సేవలందుతున్నాయి. కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వెళ్లే అవసరం లేకుండానే 80 శాతం శస్త్ర చికిత్సలను వైద్యులు ఇక్కడే చేస్తుండటంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నరాలు తెగి

స్పర్శ కోల్పోయినా..

స్థానిక కోట్లవారిపల్లెకు చెందిన ఈడిగ సతీష్‌ అనే యువకునికి ప్రమాదవశాత్తూ ఎడమ అరచేతిలో గాయం కావడంతో నరాలు తెగి రెండు చేతి వేళ్లకు స్పర్శ లేకుండాపోయింది. ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు సకాలంలో టెండన్‌ రిపేర్‌ అనే ప్రక్రియ ద్వారా అత్యవసర చికిత్స చేసి తిరిగి చేతివేళ్లకు స్పర్శ వచ్చేందుకు ప్రయత్నించి సఫలీకతులయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అన్ని వ్యాధులకూ వైద్యం చేస్తున్నాం  
1
1/5

అన్ని వ్యాధులకూ వైద్యం చేస్తున్నాం

అన్ని వ్యాధులకూ వైద్యం చేస్తున్నాం  
2
2/5

అన్ని వ్యాధులకూ వైద్యం చేస్తున్నాం

అన్ని వ్యాధులకూ వైద్యం చేస్తున్నాం  
3
3/5

అన్ని వ్యాధులకూ వైద్యం చేస్తున్నాం

అన్ని వ్యాధులకూ వైద్యం చేస్తున్నాం  
4
4/5

అన్ని వ్యాధులకూ వైద్యం చేస్తున్నాం

అన్ని వ్యాధులకూ వైద్యం చేస్తున్నాం  
5
5/5

అన్ని వ్యాధులకూ వైద్యం చేస్తున్నాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement