భారీగా మొబైల్ ఫోన్ల రికవరీ
కర్నూలు: పోయిన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని బాధితులకు అందించేందుకు పోలీసు శాఖ శ్రమిస్తోంది. రకరకాల కారణాలతో చోరీకి గురైన, పోగొట్టుకున్న సెల్‌ఫోన్ రికవరీలో జిల్లా పోలీసులు సత్తా చాటుతున్నారు. లాస్ట్ మొబైల్ ట్రాకింగ్ అప్లికేషన్ ద్వారా బాధితుడు ఇచ్చిన ఓ చిన్న ఫిర్యాదుతో పోయిన సెల్‌ఫోన్ ఇతర రాష్ట్రాలు, జిల్లాలు, ఎక్కడున్నా పట్టేస్తున్నారు. ఇప్పటివరకు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ హయాంలో రూ.16 కోట్ల విలువ చేసే 7,154 సెల్‌ఫోన్లు, కృష్ణకాంత్ హయాంలో రూ.2.56 కోట్ల విలువ చేసే 1,282 సెల్‌ఫోన్లు, బిందు మాధవ్ హయాంలో రూ.1.34 కోట్ల విలువైన 587 సెల్‌ఫోన్లు, విక్రాంత్ పాటిల్ బాధ్యతలు చేపట్టిన నెల రోజుల వ్యవధిలోనే మొదటిసారిగా 600 సెల్‌ఫోన్లు రికవరీ చేశారు. శుక్రవారం బాధితులను జిల్లా పోలీస్ పరేడ్ మైదానానికి పిలిపించి ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా అందజేశారు. ఫోన్ పోగొట్టుకున్న వారిలో పలువురు ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, రైతులు, మహిళలు, ఇతర వర్గాల వారు ఉన్నారు. తక్కువ వ్యవధిలో, మూడు నాలుగేళ్ల క్రితం పోగొట్టుకుని ఆశ వదులుకున్న వారి చేతికి మొబైల్ రికవరీ మేళాలో ఫోన్ అందడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఎస్పీతో పాటు జిల్లా పోలీసులు, సైబర్ ల్యాబ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, ఏ ఆర్ డీఎస్పీ భాస్కర్‌రావు, సీఐలు తేజమూర్తి, రామ య్య నాయుడు, నాగరాజరావు, వేణుగోపాల్, సైబ ర్ ల్యాబ్ టెక్నికల్ బృంద సభ్యులు పాల్గొన్నారు.
ఆనందం వ్యక్తం చేసిన బాధితులు
భారీగా మొబైల్ ఫోన్ల రికవరీ
Comments
Please login to add a commentAdd a comment