
ఏఈఓల సంఘం జిల్లా కోశాధికారిగా నరసింహుడు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం(ఏఈఓలు) కోశాధికారిగా వి.నరసింహుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖాళీగా ఉన్న ఈ పోస్టు భర్తీకి శనివారం కలెక్టరేట్‌లోని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. మంత్రాలయం మండలంలో ఏఈఓగా పని చేస్తున్న నరసింహుడుని కార్యవర్గసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంపికకు పరిశీలకుడిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.నాగేశ్వరరెడ్డి వ్యవహరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం అధ్యక్షుడు చాంద్‌బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, ఇతర కార్యవర్గసభ్యలు పాల్గొన్నారు.
కొలనుభారతి దేవికిప్రత్యేక పూజలు
కొత్తపల్లి: రాష్ట్రంలో ఏకైక సరస్వతి క్షేత్రంగా విరాజిల్లుతున్న కొలనుభారతి దేవి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసి మహాన్యా స పూర్వక రుద్రాభిషేకం, మహామంగళహారతి వంటి విశేష పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లోక కల్యాణం, ప్రజలు పాడి పంటలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రధాన అర్చకుడు గంట్యాల శ్రీనివాస శర్మ సరస్వతి హోమం నిర్వహించారు.
బైక్ కొనివ్వలేదని
యువకుడి ఆత్మహత్య
పగిడ్యాల: తండ్రి బైక్ కొనివ్వనందుకు ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్త ముచ్చుమర్రి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోయ వెంకటేశ్వర్లుది నిరుపేద కుటుంబం. వ్యవసాయ పనులకెళ్తూ జీవనం సాగించే ఇతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శివరామ్ (21) బోలెరో వాహనానికి డ్రైవర్‌గా వెళ్తున్నాడు. కొద్ది రోజుల నుంచి తనకు బైక్ కొనివ్వాలని తండ్రిని వేధించేవాడు. శుక్రవారం రాత్రి తండ్రితో గొడవపడి ఆవేశంతో ఇంట్లోకి వెళ్లి ఉరేసున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి ఉరికి వేలాడుతున్న యువకుడిని కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ముచ్చుమర్రి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఏఈఓల సంఘం జిల్లా కోశాధికారిగా నరసింహుడు

ఏఈఓల సంఘం జిల్లా కోశాధికారిగా నరసింహుడు
Comments
Please login to add a commentAdd a comment