
భార్య హత్య కేసులో భర్త అరెస్ట్
కొలిమిగుండ్ల: బెలుం శింగవరంలో భార్యను హత్య చేసిన కేసులో భర్తను అరెస్ట్ చేసినట్లు సీఐ రమేష్‌బాబు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో శనివారం నిందితుడి వివరాలను విలేకరుల సమావేశంలో సీఐ వెల్లడించారు. గ్రామానికి చెందిన బిజ్జం చిన్న వెంకట్రామిరెడ్డి, మనోహరమ్మ దంపతులు వ్యవసాయ పనులకు వెళ్తూ జీవనం సాగించేవారు. కాగా చిన్న వెంకట్రామిరెడ్డి మద్యానికి బానిస కావడం, ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పర్చుకుని ఆస్తులతో పాటు డబ్బులు పొగొట్టుకున్నాడు. పూర్తిగా మద్యానికి బానిసై పనికి పోకుండా ఖాళీగా ఉంటూ భార్యతో గొడవ పడేవాడు. మనోహరమ్మ కూలీ పనుల ద్వారా వచ్చిన డబ్బుల కోసం ఘర్షణ పడి లాక్కునేవాడు. పైగా భార్యపై రోజు రోజుకు అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 6వ తేదీన కూలీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చిన భార్యను రోకలి బండతో బలంగా కొట్టడంతో దుర్మరణం చెందింది. మృతురాలి తండ్రి గడ్డం తిమ్మా రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితు డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment