
తండ్రి మృతి.. తనయుడికి గాయాలు
కల్లూరు/ వెల్దుర్తి: బైక్‌ను గుర్తుతెలియన వాహనం ఢీకొనడంతో తండ్రి మృతి చెందగా తనయకుడికి గాయలయ్యాయి. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద హైవే 44పై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఉలిందకొండ ఎస్‌ఐ ధనుంజయ, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. వెల్దుర్తి ఎల్లమ్మ గుడి పూజారి అయిన ఎల్లమద్దిలేటి టైలర్ పనిచేస్తూ తన కుమారుడు ఎల్లస్వామిని బీటెక్ చదివిస్తున్నారు. కుమారుడితో కలిసి బైక్‌పై వెల్దుర్తి నుంచి కర్నూలుకు ఆరోగ్య పరీక్షల నిమిత్తం వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తుండగా చిన్నటేకూరు సమీపంలో గుర్తుతెలియన వాహనం వీరి బైక్‌ను ఢీకొంది. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలుకొట్టింది. బైక్ వెనుక కూర్చున్న తండ్రి ఎల్లమద్దిలేటి రోడ్డుపై పడ్డి తీవ్ర రక్తగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్ నడుపుతున్న ఎల్లస్వామి స్వల్పగాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న ఉలిందకొండ పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. సంఘటనా ప్రాంతంలో తండ్రి మృతదేహం వద్ద కుమారుడి రోదన కంటతడి పెట్టించింది. మృతునికి భార్య లక్ష్మిదేవి, కుమారుడు, డిగ్రీ చదువుతున్న కుమార్తె ఉన్నారు.
బైక్‌ను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం

తండ్రి మృతి.. తనయుడికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment