
నాణ్యమైన విద్యకు చిరునామా ‘బనవాసి ఏపీఆర్‌జేసీ’
దరఖాస్తుకు ఈ నెల 31 ఆఖరు
● ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష ● నాలుగు జిల్లాల విద్యార్థినులకు అవకాశం
ఎమ్మిగనూరు రూరల్: బనవాసి ఏపీ గురుకుల జూనియర్ కాలేజీ క్రమ శిక్షణకు, నాణ్యమైన విద్యా బోధనకు పెట్టింది పేరు. కాలేజీలో సీటు రావటం విద్యార్థినులు అదృష్టంగా భావిస్తారు. ఏపీ గురుకుల కాలేజీలో చదువుకున్న విద్యార్థిని ఉన్నత విద్యలో రాణిస్తుందనే నమ్మకం. రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన విద్యార్థినులకు ఇక్కడ రెండు సంవత్సరాల విద్యాబోధన అందుతుంది. ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధిస్తే సీటు వచ్చినట్లే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, క్రీడాకారులు, అనాథలు, ఎన్‌సీసీ కేడెట్లకు రిజర్వేషన్ వర్తిస్తుంది. సీటు దక్కించు కున్న విద్యార్థినులకు హాస్టల్ వసతి కూడా ఉంటుంది. కాలేజీలో బాలికలకు ఎంపీసీలో 60 సీట్లు, బైపీ సీలో 40 సీట్లు, ఎంఈసీలో 30 సీట్లు ఉంటాయి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు:
ఇంటర్మీడియట్ ప్రవేశానికి పదో తరగతి విద్యార్థి నీలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు https//aprs.apcfss.in వెబ్‌సైట్‌ను చూడవచ్చును. ఈనెల 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే.. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న (మధ్యా హ్నం 2.30 నుంచి 5 గంటల) నిర్వహిస్తారు.
బాలికలకు మంచి అవకాశం
రాయలసీమలోని నాలుగు జిల్లా విద్యార్థినులకు ఇది మంచి అవకాశం. కాలేజీలో సీటు వస్తే రెండు సంవత్సరాలు బోధన అందిస్తాం. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– వి.గీర్వాణి, జిల్లా కో–ఆర్డినేటర్,
ప్రిన్సిపాల్ ఏజీఆర్‌జేసీ బనవాసి

నాణ్యమైన విద్యకు చిరునామా ‘బనవాసి ఏపీఆర్‌జేసీ’
Comments
Please login to add a commentAdd a comment