రోగాలు వస్తున్నాయి
బాపురం రిజర్వాయర్ ను ంచి 15, 20 రోజులకో సారి నీరు వస్తోంది. పెద్ద ల కాలంలో తవ్వించిన ఒక్కిరేణి రక్షణ గోడలు పడిపోవడంతో పశువులు, కుక్కలు నీరు తాగి పోతున్నాయి. కలుషిత నీటితే తాగుతుండటంతో రోగాలు వస్తున్నాయి. మమ్మల్ని అధికారులు పట్టించుకోవడం లేదు.
– రామాంజినేయులు
రిజర్వాయర్ నిర్మించాలి
మా గ్రామానికి ఐదు కిలో మీటర్లు దూరంలో హంద్రీ నీ వా కాలువ ఉంది. ఆ కాలువ నీటిని మళ్లించి జొహరాపురం సమీపంలో రిజర్వాయర్ నిర్మిస్తే ఆస్పరి, చిన్నహోతూరు, శంకరబండ, చిరుమాన్‌దొడ్డి, హలిగేర గ్రామాలకు కూడా మంచి నీటిని సరఫరా చేయవచ్చు. – లక్ష్మన్న
అధికారులు పర్యటించాలి
మా గ్రామంలో జిల్లా అధికారుల ఒక్కసారి పర్యటిస్తే సమస్య ఏమిటో తెలుస్తుంది. తరతరాలు గా మేం ఒక్కిరేణి నీటినే తాగుతున్నాం. ప్రస్తుతం ఒక్కిరేణిలో ఉన్న నీరు ఒక నెల మాత్రమే సరిపోతుంది. తరవాత బిందెడు మంచి నీళ్ల కోసం పక్క గ్రామాలైన ఆస్పరి, దేవనబండకు వెళ్లాలి. – బంగారు సంజప్ప
రోగాలు వస్తున్నాయి
రోగాలు వస్తున్నాయి
Comments
Please login to add a commentAdd a comment