మంత్రి లోకేష్.. పట్టించుకోరా?
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వ విద్యాలయాల్లో ప్రవేశం కోసం నిర్వహించి కామన్ పీజీ సెట్ ఎంట్రెన్స్‌ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోమన్న, షాబీర్‌బాషా డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కామన సెట్‌తో విద్యార్థులకు ఎంతో నష్టం వాటిల్లుతోందన్నారు. ఇష్టమున్నా లేకున్నా ఇతర యూనివర్సిటీలకు వెళ్లి చదువుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే జీఓ నంబర్ 77ను రద్దుచేస్తానని చెప్పిన మంత్రి లోకేష్ పట్టించుకోవడంలేదన్నారు. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. కామన్ సెట్‌తో డిగ్రీ, పీజీ కళాశాలను మూసివేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. శరత్‌కుమార్, అభి, అశోక్, అక్షర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment