యాపదిన్నె సర్పంచ్‌పై కేసు నమోదు
డోన్ టౌన్: మండలపరిధిలోని యాపదిన్నె గ్రామానికి చెందిన తెలుగుదేశం సర్పంచ్ రామిరెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. వాటర్ షెడ్ పనుల్లో తనకు ప్రాధాన్యత ఎందుకు ఇవ్వరని మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో వాటర్ షెడ్ ఏపీఓ విజేత,ఎంపీడీఓ వెంకటేశ్వరరెడ్డి విధులకు ఆటంకం కల్గించి అసభ్య పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే. దీనిపై సదరు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామిరెడ్డిపై కేసు నమోదు చేసి చేసి రిమాండ్‌కు పంపతున్నట్లు బుధవారం సీఐ ఇంతియాజ్‌బాషా తెలిపారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
అవుకు: మండల పరిధిలోని చెన్నంపల్లె గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేతంచర్ల మండలం బలపాలపల్లె గ్రామానికి చెందిన చిన్న తిమ్మిగాళ్ల వేణుగోపాల్ (37) భార్యాపిల్లలతో సహా గత రెండేళ్లుగా అవుకులో నివాసం ఉంటూ గౌండ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం చెన్నంపల్లె గ్రామంలో ఓ ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా స్లాబ్‌ను కూలుస్తుండగా ప్రమాదవశాత్తు పైన ఉన్న కరెంట్ తీగలు తగిలి కిందపడ్డాడు. దీంతో 108 అంబులెన్స్ ఈఎంటీ జనార్దన్ రెడ్డి అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య చిన్న తిమ్మగాళ్ల ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ క్రిష్ణయ్య తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు సంతానం.
రంగాపురం జెడ్పీ హైస్కూలు విద్యార్థిని ఆత్మహత్య
బేతంచెర్ల: మండల పరిధిలోని ఆర్‌ఎస్ రంగాపురం జెడ్పీ హైస్కూలో 10 వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల మేరకు గ్రామానికి చెందిన తిరుమలేశ్వరెడ్డి, లావణ్య దంపతుల పెద్ద కుమార్తె మధు లత(15) గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతోంది. కుటుంబ సమస్యలో మరే కారణం చేతనో ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో బుధవారం ఉదయం ఫ్యానుకు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బయటకు వెళ్లిన తల్లి లావణ్య ఇంటికి వచ్చి చూసి వెంటనే వేలాడుతున్న కుమార్తెను కిందికి దింపి చూడగా అప్పటికే మృతి చెందింది. మరో 5 రోజుల్లో పబ్లిక్ పరీక్షలకు హాజరు కావలసిన విద్యార్థిని మృతి పట్ల తోటి విద్యార్థులు కన్నీరు, మున్నీరుగా విలపించారు. హెచ్‌ఎం మల్లికార్జున, ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు.
యాపదిన్నె సర్పంచ్‌పై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment