ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
పాణ్యం: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. గురువారం పాణ్యం సీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్ల నైట్ డ్యూటీ రోస్టర్ పట్టికను తనిఖీ చేశారు. ప్రతి నెలకు ఎన్ని కాన్పులు చేస్తున్నారని వైద్యులను ప్రశ్నించి సిజేరియన్ కాన్పులు అధికంగా జరుగుతుండడంతో కారణాలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో నలుగురు డాక్టర్లు ఉండగా అనస్తీయా డాక్టర్ మునిస్వామి మాత్రమే విధుల్లో ఉండగా మిగిలిన వారు ఎక్కడని ప్రశ్నించగా, ఒకరు నైట్ డ్యూటీ, మరొకరు ట్రైనింగ్ వెళ్లారని బదులిచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. అనంతరం పాణ్యం ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎంఎస్‌ఎం భవనం కోసం ఎకరా, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నాగులు ఎకరాల భూమికి సంబంధించి ప్రతిపానదలు త్వరగా పంపాలని తహసీల్దార్ నరేంద్రనాథ్‌రెడ్డిని ఆదేశించారు. చెంచుకాలనీలో గృహనిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించారు.
కలెక్టర్ రాజకుమారి
Comments
Please login to add a commentAdd a comment