ఎమ్మెల్యే దళితుడని.. ఎంపీ మహిళని!
● ప్రజాప్రతినిధులను కాదని టీడీపీ
నాయకుడితో ప్రారంభోత్సవాలు
● ప్రొటోకాల్ ఉల్లంఘించిన
టీడీపీ నంద్యాల పార్లమెంటరీ ఇన్‌చార్జి
నందికొట్కూరు: పట్టణంలో ప్రొటోకాల్ పాటించకుండా టీడీపీ నంద్యాల పార్లమెంటరీ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి గురువారం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో సుమారు రూ.7 లక్షలతో విద్యుత్ ట్రాన్‌ఫార్మర్ నిర్మించారు. అక్కడే ముఖద్వారం కూడా నిర్మించారు. ఆ రెండింటినీ శివానందరెడ్డి ప్రారంభించి, శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే గిత్తా జయసూర్య దళితుడు కావడం, ఎంపీ బైరెడ్డి శబరి మహిళా కావడం, మున్సిపల్ చైర్మన్ సుధాకర్‌రెడ్డి ఎంపీ వర్గానికి చెందిన వారు కావడంతో అంతా తానై శివానందరెడ్డి ప్రారంభోత్సవాలు చేయడం గమనార్హం. విద్యుత్ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే, ఎంపీ, మున్సిపల్ చైర్మన్ పట్ల ఏమాత్రం గౌరవం ఉందో ఈ ఘటన అద్దం పడుతోందని స్థానికులు ముక్కున వేలేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment