ఎమ్మెల్యే చెప్పారని రూ.కోటి స్థలం ధారాదత్తం
డోన్: ప్రజోపకరమైన ప్రభుత్వ స్థలాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా ధారాదత్తం చేస్తున్నారు. డోన్ మున్సిపల్ పరిధిలోని కేవీఎస్ పార్కు ఆవరణలో ఐదు సెంట్ల స్థలాన్ని గత ఏడాది పిరమిడ్ ధ్యానకేంద్రం నిర్మాణానికి కేటాయిస్తున్నట్లు కౌన్సిల్ తీర్మానం చేసింది. అయితే ఆ స్థలాన్ని కాదని కొత్తపేటలోని అన్న క్యాంటీన్‌తో పాటు ఓవర్‌హెడ్ ట్యాంకు ఉన్న సర్వే నంబర్ 281లో పిరమిడ్ ధ్యానకేంద్రం నిర్వాహకులు వారంరోజుల క్రితం ధ్యానకేంద్రం నిర్మాణానికి ఏకంగా భూమిపూజ చేశారు. దీంతో మున్సిపల్ చైర్మన్‌తో పాటు కౌన్సిల్ సభ్యులు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. కేవలం ఎమ్మెల్యే మౌఖికంగా చెప్పారని కమిషనర్ ఏకపక్ష నిర్ణయంతో ప్రజోపకరమైన స్థలాలను ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు కట్టబెట్టడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎవరికి వారు కౌన్సిల్ ఆమోదం లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కోటి రూపాయల విలువైన స్థలాన్ని ప్రైవేటు సంస్థకు ఽఅప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ధార్మిక సంస్థకు పట్టణంలో ఏ మూలకై నా స్థలం కొనుగోలు చేసే శక్తి ఉండగా.. ప్రజలకు ఉపయోగపడే స్థలాన్ని ఉచితంగా కేటాయించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న తలెత్తుతోంది.
ఎమ్మెల్యే చెబితే నిర్మించుకోమన్నాం
281 సర్వే నంబర్‌లోని అన్న క్యాంటీన్ వద్ద పిరమిడ్ ధ్యానకేంద్రాన్ని అనధికారికంగా నిర్మించుకోమన్నాం. గత కౌన్సిల్‌లో పిరమిడ్ ధ్యాన కేంద్రానికి కేవీఎస్ పార్కులో స్థలం కేటాయించిన విషయం నాకు తెలియదు. స్థానిక ఎమ్మెల్యే సూచన మేరకే నిర్ణయం తీసుకున్నాం. – ప్రసాద్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్, డోన్
పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్మాణానికి కేటాయింపు
గతంలో కేవీఎస్ పార్కులో స్థలం
కేటాయింపునకు కౌన్సిల్ ఆమోదం
ప్రస్తుతం అన్న క్యాంటీన్ వద్ద
అనుమతులు
ప్రజోపకరమైన స్థలాలను
ప్రైవేటు సంస్థలకు కేటాయించడం
పట్ల ప్రజల ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment