
రాష్ట్రంలోని టీడీపీ నేతలు కపట రాజకీయాలు చేస్తున్నారు. ఇ
మార్కెట్‌లో ధర లేక
నిల్వ ఉన్న టమాట (ఫైల్)
● దురుద్దేశంతో దూదెకొండకు
టమాట ప్రాసెసింగ్ యూనిట్ మార్పు
● మాజీ సీఎం వైఎస్ జగన్‌కు
మంచి పేరు రాకుండా
ఉండాలన్నదే ఉద్దేశం
● వైఎస్సార్‌సీపీ హయాంలోనే
టమాట ప్రాసెసింగ్ యూనిట్‌కు
శ్రీకారం
● రూ.15 లక్షలు ఖర్చు చేసి
పిల్లర్లు కూడా ఏర్పాటు
● ప్రభుత్వం మారడంతో
ముడుపుల కోసం టీడీపీ నేతల ఒత్తిళ్లు
● తట్టుకోలేక పారిపోయిన కాంట్రాక్టర్
టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు వైఎస్సార్‌సీపీ హయాంలోనే పనులు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీడీపీ నేతలు ముడుపుల కోసం కాంట్రాక్టర్‌ను ముప్పు తిప్పలు పెట్టారు. దీంతో ఉక్కిరిబిక్కిరైన కాంట్రాక్టర్ పనులను నిలిపివేశారు. దీంతో పిల్లర్లకు కట్టిన కడ్డీలు కట్ చేసుకోవడంతో పాటు సిమెంటు ఇతర మెటీరియల్ మొత్తం తరలించుకుపోయారు. హోసూరులో కేటాయించిన భూమిపై లేని వివాదాన్ని టీడీపీ నేతలు సృష్టించారు. అక్కడే ప్రాసెసింగ్ యూనిట్ పెడితే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పేరు వస్తుందనే ఉద్దేశంతో స్థలాన్ని దూదెకొండ ప్రాంతానికి మార్పు చేశారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మరుగున పడిపోయాయి. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఉల్లి, టమాట సోలార్ డ్రైయర్లు నిర్వహించే పొదుపు మహిళలను నిర్లక్ష్యం చేశారు. దీంతో వారు అప్పుల ఊబిలో కూరకుపోయారు. చివరికి సోలార్ డ్రైయర్లను సరఫరా చేసిన ఎస్4ఎస్ సంస్థ వాటిని వెనక్కి తీసుకెళ్లింది. ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటును పట్టించుకోని కూటమి ప్రభుత్వం నేడు టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు భూమి పూజ అంటూ హడావుడి చేస్తోంది. పత్తికొండ మండలం దూదేకొండ గ్రామంలోని సర్వే నెంబర్ 63/3లోని 2.50 ఎకరాల్లో టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఈ నెల 5న జీవో జారీ అయ్యింది. ఈ నెల 14న భూమి పూజ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేటాయించిన నిధులతోనే టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు.
కర్నూలు(అగ్రికల్చర్): టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఉమ్మడి రాష్ట్రానికి 9 ఏళ్లు, విభజన తర్వాత ఏర్పాటైన రాష్ట్రానికి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అ 14 ఏళ్లలో ఏ నాడు కూడా జిల్లాలో టమాట ప్రాసెసెంగ్ యూనిట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేయలేదు. రైతుల కష్టాలు, కన్నీళ్ల గురించి పట్టించుకోలేదు. పత్తికొండ ప్రాంతంలో టమాట జ్యూస్ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన మాటను సైతం చంద్రబాబు మరచిపోయారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పత్తికొండలో టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. ఈ పరిశ్రమ పూర్తయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పేరు వస్తుందనే భయంతో ప్లేటు మార్చారు. హడావుడిగా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు జీవో ఇచ్చారు. కర్నూలు ఎమ్మెల్యే, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు శుక్రవారం భూమి పూజ చేయనున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పట్టించుకోని కూటమి ప్రభుత్వం హడావుడిగా భూమి పూజ కార్యక్రమం చేపట్టడంపై రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గతంలో పనులు ఇలా..
టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు ప్రక్రియ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే మొదలైంది. అప్పట్లో పత్తికొండ సమీపంలోని హోసూరు గ్రామం సర్వే నంబరు 286/1ఏ3, 286/1ఏ4, 286/1ఏ5ల్లోని 3.60 ఎకరాల భూమిని కేటాయించారు. రూ.12.05 కోట్ల నిధులతో బిల్డింగ్ నిర్మాణంతోపాటు మిషనరీలు ఏర్పాటు చేసే విధంగా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిర్మాణపు పనులు కూడా మొదలై చురుగ్గా జరిగే స్థాయికి వచ్చాయి. దాదాపు రూ.15 లక్షలు ఖర్చు చేసి పిల్లర్స్ కూడా వేశారు. అయితే గత ఏడాది మే నెలలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ గెలిచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతోనే సమీకృత టమాట ప్రాసెసింగ్ యూనిట్ గ్రహణం పట్టినట్లు అయింది.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల దుస్థితి ఇదీ..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉల్లి, టమాట రైతుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున సోలార్ డ్రైయర్లు ఏర్పాటయ్యాయి. మహిళలు వాటిని సద్వినియోగం చేసుకొని రాణించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పట్టించుకునే దిక్కులేక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. అప్పట్లో కల్లూరు, గూడూరు, గోనెగండ్ల తదితర మండలాల్లో 322 సోలార్ డ్రైయర్ల యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇవి 2024 మే నెల వరకు ఇవి పనిచేశాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రోత్సాహం లేక మూలనపడ్డాయి. సోలార్ డ్రైయర్లను ఎస్4ఎస్ సంస్థ వెనక్కి తీసుకెళ్లింది.
రైతులు నమ్మరు
రాష్ట్ర ప్రభుత్వం టమాట రైతులను ఎప్పుడూ పట్టించుకోలేదు. మార్కెట్‌లో టమాట ధర పడిపోయినప్పుడు కనీసం స్పందించలేదు. పొలాల్లోనే పంటలను వదిలేస్తున్నా అధికారులను పంపించలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన టమాట ప్రాసెసింగ్ యూనిట్‌కు ఆపేసి ఇప్పుడు హంగామా చేస్తున్నారు. అధికారంలో ఉన్న టీడీపీ నాయకులను రైతులు ఎవరూ నమ్మరు. వారు చెప్పే మాటలన్నీ బూటకమే అని అర్థమవుతోంది.
– టి. శ్రీనివాసులు, హోసూరు,
పత్తికొండ మండలం
టమాట రైతుల దుస్థితి ఇదీ..
రబీ సీజన్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1,700 ఎకరాల్లో టమాట పంట సాగైంది. కర్నూలు జిల్లాలో 1,250, నంద్యాల జిల్లాలో 450 ఎకరాల్లో టమాట పంట సాగు చేశారు. మార్కెట్‌లో క్వింటాకు కనిష్టంగా రూ.100 వరకు, గరిష్టంగా రూ.600 వరకు ధర లభించింది. కిలో రూ.4 నుంచి రూ.5 పలుకుతుండడంతో విధిలేని పరిస్థితిలో కర్నూలు మండలం పడిదెంపాడు, ఈ.తాండ్రపాడు, నందనపల్లె, పూడూరు, శివరామాపురం గ్రామాల్లో టమాట పంటను పశువులకు మేతగా వదిలేశారు. కృష్ణగిరి పెనుమాడ సమీపంలో పొలాలను ఇలాగే వదిలేశారు. పెట్టుబడి రాక నష్టం పోయినా ప్రభుత్వం సాయం కూడా అందించలేదని రైతులు ఆరోపించారు.
ప్రస్తుత కుట్ర ఇదీ..
అంతా
హడావుడి

రాష్ట్రంలోని టీడీపీ నేతలు కపట రాజకీయాలు చేస్తున్నారు. ఇ

రాష్ట్రంలోని టీడీపీ నేతలు కపట రాజకీయాలు చేస్తున్నారు. ఇ
Comments
Please login to add a commentAdd a comment