అండగా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్
వస్తు సేవల్లో నాణ్యత లోపించినా.. కల్తీ ఆహార పదార్థాలను విక్రయించినా.. బీమా, బ్యాంకులు మోసానికి పాల్పడినా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అండగా ఉంటుంది. జిల్లా స్థాయిలో రూ.5 లక్షల వరకు మోసాలకు ఎలాంటి కోర్టు ఫీజు చెల్లించకుండానే వినియోగదారుడు తగిన పరిహారం పొందవచ్చు. న్యాయవాది అవసరం లేకుండానే పోరాటం చేయవచ్చు. రూ.5 లక్షల పైన వివాదాలకు కోర్టు ఫీజులతో పాటు న్యాయవాదులను నియమించుకునే అవకాశం ఉంది. జిల్లా కమిషన్ గత మూడ్లేలో 635 కేసులను పరిష్కరించగా.. రూ.15 కోట్లను పరిహారంగా వినియోగదారులకు అందించింది. ప్రస్తుతం 119 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
నిర్భయంగా ఫిర్యాదు చేయాలి
వినియోగదారుల హక్కులు కాపాడడం మా ప్రథమ కర్తవ్యం. మోసపోయిన వారు కమిషన్‌ను ఆశ్రయిస్తే తగిన న్యాయం చేస్తాం. రూ.5 లక్షల వరకు ఎలాంటి ఫీజు ఉండదు. ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు తీసుకుంటాం. మార్టులు, మాల్స్‌లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేస్తే పరిష్కారానికి కమిషన్ సిద్ధంగా ఉంటుంది.
– కరణం కిశోర్, చైర్మన్,
వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్
Comments
Please login to add a commentAdd a comment