ఓర్వకల్లు: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శిగా అబ్దుల్ గఫార్‌ను నియమించినట్లు పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర వైఎస్సార్‌సీపీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర మైనార్టీ విభాగంలో జిల్లాకు చెందిన కొందరికి స్థానం లభించినట్లు తెలిపారు. అందులో భాగంగా రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శిగా నన్నూరు గ్రామానికి చెందిన మైనార్టీ నాయకులు అబ్దుల్ గఫార్‌ను నియమించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈయన నియామకం పట్ల జిల్లా మైనార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
క్రెడాయ్ నూతన చైర్మన్‌గా గోరంట్ల రమణ
కర్నూలు (టౌన్): క్రెడాయ్ (కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) నూతన చైర్మన్‌గా గోరంట్ల రమణ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం స్థానిక కల్లూరు రోడ్డులో ఉన్న క్రెడాయ్ భవనంలో క్రెడాయ్ సభ్యుల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కర్నూలు చాప్టర్ నూతన చైర్మన్‌తో పాటు అధ్యక్షుడిగా సురేష్ రెడ్డి, కార్యదర్శిగా గోవర్దన్‌రెడ్డిని ఎన్నుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా అర్కిటెక్ రంగనాథ రెడ్డి వ్యవహరించారు. నూతనంగా ఎన్నికై న చైర్మన్ గోరంట్ల రమణ మాట్లాడుతూ 2015 నుంచి 2021 వరకు క్రెడాయ్ సంస్థలో కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశానన్నారు. క్రెడాయ్ సంస్థ ద్వారా ప్రాపర్టీషోలు నిర్వహించామన్నారు. నూతన కార్యవర్గంతో ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొంటున్న నిర్మాణ రంగానికి నూతనోత్సాహం తీసుకువస్తామని స్పష్టం చేశారు.
రౌడీ షీటర్ల కదలికలపై నిఘా
● పోలీస్ స్టేషన్ల వారీగా
రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్
కర్నూలు: కర్నూలు శివారుల్లోని షరీన్‌నగర్‌లో టీడీపీ నాయకుడు సంజన్న హత్య సంఘటన నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. హంతకుడు వడ్డే రామాంజనేయులు అలియాస్ అంజిపై అనేక కేసులు ఉండడమే గాక, రౌడీ షీట్ కూడా ఉండడంతో రౌడీ షీటర్ల కదలికలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా అంతటా పోలీస్ స్టేషన్ల వారీగా రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి గౌరవ ప్రదమైన జీవితం కొనసాగించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు కౌన్సెలింగ్ ఇస్తునే, కొత్తగా కేసుల్లో ఇరుక్కున వారి జాబితాను సిద్ధం చేస్తున్నారు. స్టేషన్ల వారీగా రౌడీ షీటర్లు జీవనోపాధికి చేస్తున్న వృత్తులపై కూడా ఆరా తీస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే, పోలీస్ శాఖ పరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్ కార్యదర్శిగా అబ్దుల్ గఫా