టీడీపీలో ఇరువర్గాల ఘర్షణ
సంజామల: గ్రామాల్లో అధిపత్యం కోసం తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. ఈ విషయంలోనే సంజామల మండలం ఆకుమల్ల గ్రామంలో ఆదివారం రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. గ్రామ సంఘం పెద్దను ఎన్నుకునే విషయంలో అధికారపార్టీలో విభేదాలు తలెత్తాయి.సంఘం పెద్ద కోసం మల్లు మహేశ్వర్ రెడ్డి, దుబ్బ రామగోవింద్ రెడ్డి వర్గాల మధ్య పోరు నడుస్తోంది.అయితే, ఆదివారం ఉదయం పాత వారే కొన సాగుతారని మల్లు మహేశ్వర్‌రెడ్డి వర్గం దండోర వేయిస్తుండగా ప్రత్యర్థి వర్గం అడ్డుకుంది. ఈ విషయంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా మల్లు మహేశ్వరరెడ్డి, ఆయన వర్గానికి చెందిన కై పరమణారెడ్డి, కై ప మోహన్‌రెడ్డికి గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో దుబ్బ రామగోవింద్‌రెడ్డి, యనకండ్ల తిమ్మయ్యతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ రమణయ్య తెలిపారు.
గుర్తు తెలియని
యువకుడి ఆత్మహత్య
మంత్రాలయం: స్థానిక ఎమ్మిగనూరు రోడ్డులోని జగ నన్న కాలనీ సమీపంలో ఓ గుర్తు తెలియని యువకు డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.టవల్‌తో వేప చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ శివాంజల్ అ క్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆచూకీ కోసం గుర్తించేందుకు ప్రయత్నించగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. యువకుడి వయస్సు దా దాపు 35 నుంచి 40 ఏళ్లు ఉండి, గళ్ల చొక్కా ధరించా డు. మృతదేహం ఉబ్బిపోయి ఉండటంతో మూడు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
గల్లంతైన బాలుడు
శవమై తేలాడు
ఆదోని అర్బన్: రెండు రోజుల క్రితం బసాపురం ఎల్లెల్సీ కాలవలో గత్లంతైన పట్టణంలోని బోయగేరికి చెందిన శేఖర్ కుమారుడు హరికృష్ణ (16) ఆదివారం శవమై కనిపించాడు. అగ్నిమాపక సిబ్బంది సంజీవ్‌కుమార్, మల్లికార్జునరెడ్డి, అనీఫ్, వెంకటేశ్వర్లు, చిదంబరంరెడ్డి, నరసింహులు, మహమ్మద్ శుక్రవారం నుంచి గాలింపు చర్యలు చేపడుతున్నారు. బాలుడు గల్లంతైన ప్రాంతానికి కొద్ది దూరంలో ఆదివారం ఉదయం మృతదేహం కనిపించడంతో బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఇస్వీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment