● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్‌రెడ్డి
కర్నూలు (టౌన్): ఎన్ని కుయుక్తులకు పాల్పడినా వైఎస్సార్‌సీపీపై ప్రజాభిమానం చెక్కుచెదరలేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నా రు. జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడిగా ఏక గ్రీవంగా ఎన్నికై న మదర్థాన్ ఇలియాస్ ఖాన్, జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి కలిసి గురువారం సాయంత్రం కర్నూలు గిప్సన్ కాలనీలో ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డిని కలిశారు. శాలువా కప్పి సన్మానించారు. గెలుపొందిన జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యున్ని ఎస్వీ సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ.. ‘కూటమి’ నేతలు ఎన్ని కు ట్రలు చేయాలని చూసినా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచారన్నారు. విజయంలో కీలకంగా వ్యవహరించిన పత్తికొండ మాజీ ఎ మ్మెల్యే కంగాటి శ్రీదేవి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు.