కమనీయం.. కల్యాణోత్సవం
● వైభవంగా గోరంట్ల మాధవుడి
గరుడోత్సవం
కోడుమూరు రూరల్: శ్రీలక్ష్మీ మాధవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గోరంట్ల గ్రామంలో సోమవారం వేకువజామున కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాధవస్వామి తరఫున ఎర్రగుడి గ్రామస్తులు, అమ్మవార్ల తరఫున గోరంట్ల వాసులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. ఆలయ పండితులు ఆగమశాస్త్ర ప్రకారం కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఉత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి వందలాదిగా తరలివచ్చారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈఓ గుర్రెడ్డి, వేద పండితులు వందవాసి రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ, పురుషోత్తం, హరి, శ్రీనివాస ఆచారి, వెంకటరమణ, రమణమూర్తి, వెంకట్రామయ్య, రాజేష్, పద్మానాభ ఆచారి, ఎస్‌ఐ శ్రీనివాసులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఘనంగా గరుడోత్సవం
కల్యాణోత్సవం అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీలక్ష్మి, భూదేవి, మాధవస్వామిని గరుడ వాహనంపై అధిష్టింపజేశారు. డప్పువాయిద్యాలు, మేళతాళాల మధ్య గ్రామ వీధుల్లో గరుడోత్సవం నిర్వహించారు. గరుడ వాహనానికి ముందు ఎర్రగుడి వాసులు, వెనుక గోరంట్ల వాసులు నిలబడ్డారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గరుడోత్సవాన్ని నిర్వహిస్తున్న తరుణంలో ఎర్రగుడి గ్రామానికి చెందిన సుధాకర్ అనే భక్తుడి కాలికి గాయమైంది. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కమనీయం.. కల్యాణోత్సవం
కమనీయం.. కల్యాణోత్సవం
Comments
Please login to add a commentAdd a comment