ఎకై ్సజ్‌లో అసోసియేషన్ ఎన్నికల కోలాహలం
కర్నూలు: ఎకై ్సజ్ శాఖలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్ల అసోసియేషన్ ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. మూడేళ్లకోసారి జరగాల్సిన అసోసియేషన్ ఎన్నికలు తొమ్మిదేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఓబులేసు, వైవీ గిరిబాబు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఓబులేసు నంద్యాల డీటీఎఫ్‌లో పనిచేస్తుండగా మరో అభ్యర్థి గిరిబాబు కర్నూలు ఏసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ 1995 బ్యాచ్‌కు చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు. ఎకై ్సజ్ శాఖలోకి డిప్యూటేషన్‌పై వచ్చి ఇక్కడే విలీనమయ్యారు. 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్లతో పాటు 2014 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుళ్లు ఐఎంఎల్ డిపో, కారుణ్య నియామకం కింద ఎంపికై నవారు వివిధ విభాగాల్లో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం 135 మంది కానిస్టేబుళ్లు, 75 మంది హెడ్ కానిస్టేబుళ్లు కలిపి 210 మంది తమ ఓటు ద్వారా అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంది. అధ్యక్ష పదవికి ఓబులేసు, గిరిబాబు పోటీ పడుతుండగా, ప్రధాన కార్యదర్శి పదవికి విజయ్‌కుమార్, జగన్నాథం పేర్లు వినిపిస్తున్నాయి. ఈనెల 23న కర్నూలు ఎకై ్సజ్ కార్యాలయ ఆవరణంలో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. ఎన్నికల తేదీ గడువు సమీపిస్తుండటంతో బరిలో ఉన్న అభ్యర్థులు.. ఎకై ్సజ్ స్టేషన్లతో పాటు ఈఎస్‌టీఎఫ్, మొబైల్ పార్టీ, చెక్‌పోస్టు, ఎన్‌ఫోర్స్‌మెంట్, నంద్యాల, కర్నూలు ఈఎస్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని కలిసి తమ విజయానికి దోహదపడాలని అభ్యర్థిస్తున్నారు. ఎకై ్సజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఇటీవలనే ఎన్నికలు నిర్వహించి ఆ సంఘం అధ్యక్షునిగా రాజేంద్రప్రసాద్‌ను ఎన్నుకున్న విషయం తెలిసిందే.
జోరుగా ప్రచారం చేస్తున్న అభ్యర్థులు
ఈనెల 23న పోలింగ్
ఎకై ్సజ్‌లో అసోసియేషన్ ఎన్నికల కోలాహలం
Comments
Please login to add a commentAdd a comment